Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా వారాహి వెహికల్ తో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన బస్సుని సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ బస్సుని వారం రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక బస్సు ఫోటోలు షేర్ చేసి వారాహి యుద్ధానికి సిద్ధం అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్, నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిందే. ఇక వైసీపీ విమర్శలపై జనసేనాని కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. అయితే తాజాగా వైసీపీ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వారు అందరూ షాక్ అయ్యే వార్త బయటకి వచ్చింది.
15 రోజుల క్రితమే వారాహి వాహనానికి హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీవో కమిషనర్ తాజాగా మీడియాకి క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కి వచ్చినపుడు అది పవన్ కళ్యాణ్ వెహికల్ అనే విషయం తెలియదని చెప్పారు. ఇక వాహనం నిబంధనలకి అనుగుణంగా ఉందని, రంగు విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఆర్మీ వాహనాలకి ఉపయోగించే రంగుకి వారాహి రంగుకి వ్యత్యాసం ఉందని చెప్పారు. అలాగే అన్ని నిబంధనలకి లోబడి ఉండటంతో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, నెంబర్ కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఇక వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయ్యింది. అయితే వాహనంపై తప్పుడు ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపాలని వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయనే మాట వినిపిస్తుంది. అయితే ఆ వాహనంతో ప్రచారం నిర్వహించాబోయేది ఏపీలోనే కాబట్టి ఇక బస్సు యాత్ర మొదలు పెట్టడానికి ముందే తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఏవో కొన్న నిబంధనలు తీసుకురావాలని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, ఏపీలో ఆర్టీఐ నిబంధనలకి లోబడి ఉంటేనే వారాహి ఇక్కడ రహదారులపై తిరుగుతుందని మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీని ద్వారా కచ్చితంగా ఏపీలోఆర్టీఐ నిబంధనలు అంటూ ఏదో ఒక రకంగా ఆరంభంలోనే బస్సు యాత్రకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
బస్సు యాత్ర ప్రారంభమైన యాత్ర మధ్యలో ఏదో ఒక కారణం చూపించి అడ్డుకునే ప్రయత్నం కూడా జరగొచ్చని కూడా వైసీపీ నాయకుల మాటల బట్టి అర్ధం అవుతుంది. ఏపీలో టీడీపీ, జనసేనకి యాత్రలు చేసే అవకాశం ఇవ్వమని, కచ్చితంగా అడ్డుకుంటామని సోషల్ మీడియాలో, అలాగే నాయకులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దీనిని బట్టి ఏపీలో పవన్ కళ్యాణ్ ని వీలైనన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం ద్వారా జనసేనని టీడీపీకి దూరం చేసి ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.