Milk: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో ఎన్నో రకాల కలలు మనకు వస్తూ ఉంటాయి అయితే కొన్ని కళలు ఎంతో మంచివి సంతోషాన్ని కలిగించేవి కాగా మరికొన్ని కలలు భయంకరమైనటువంటి భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి అలాంటి కలలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి కలలో పాలు కనిపిస్తూ ఉంటాయి. పాలు పొంగిపోయినట్టు కనిపించడం విరిగిపోయినట్టు కనిపించడం లేదా పాలు ఇతరులకు పోస్తూ ఉన్నట్టు కనిపించడం జరుగుతూ ఉంటుంది.
ఈ విధంగా మన కలలో కనక పాలు కనిపిస్తే దేనికి సంకేతం అనే విషయం గురించి స్వప్న శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే మన కలలో పాలు కనిపించడం శుభసంకేతం అయితే మనం పాలు ఎవరికైనా పోస్తూ ఉన్నట్టు కలలో కనిపించకూడదు అలా కనిపించడం చెడుకు సంకేతం అలాగే పాలు మరుగుతున్నప్పుడు విరిగిపోయిన కూడా చెడును సూచిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది త్వరలో మన ఇంట్లో ఏదో సంక్షోభం రాబోతుందని తెలియజేయడానికే ఇలా పాలు కలలో కనిపిస్తూ ఉంటాయి.
పాలు మరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే అది సంతోషకరమైన భవిష్యత్తును సూచిస్తుంది. అంతేకాకుండా పాలలో పంచదార వేసి కలుపుతూ ఉన్నట్టు కనక కలలు వస్తే తప్పకుండా శుభం జరగబోతుందని అర్థం. చాలామందికి కలలో పాలు తాగినట్టుగా కనిపిస్తుంది. పాలు తాగడం చూస్తున్నట్లుగా కూడా కల వస్తుంది. ఈ కల వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇలా కల వస్తే పురోగతికి మార్గం సుగమం అవుతుందని, భవిష్యత్తులో మంచి జరుగుతుందని అర్థం.