Megastar Chiranjeevi: మెగా ఫ్యామిలీలో అన్నదమ్ముల అనుబంధం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తాను పైకి ఎదగడంతో పాటు తన కుటుంబాన్ని కూడా పైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన స్థానం కల్పించారు. నిజంగా ఉమ్మడి కుటుంబం అంతే ఇలా ఉండాలి అని మెగా ఫ్యామిలీని చూస్తే అనిపిస్తుంది. అయితే మెగా ఫ్యామిలీని ద్వేషించే వారు కూడా ఉంటారు.
అయితే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా కూడా మెగా ఫ్యామిలీలో తిరిగి వారిని కామెంట్స్ చేసే గుణం ఎవరికి లేదు. అలాంటి పద్ధతిలో వారు నడించారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తరువాత వాటిలో ఇమడలేక బయటకి వచ్చేసారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలలో కొనసాగుతూ జనసేన పార్టీని స్థాపించి ముందుకి వెళ్తున్నారు.

రాజకీయ ప్రయాణంలో సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకుంటూ ముందుకి వెళ్తున్నారు. మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి చాలా సార్లు పవన్ కళ్యాణ్ పైన తనకున్న ప్రేమని చూపిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సారి పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయాన్ని చిరంజీవి తెలియజేశారు. సింగర్ స్మిత నిర్వహిస్తున్న టాక్ షోలో మొదటి గెస్ట్ గా చిరంజీవి పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవిని స్మిత ఆసక్తికర ప్రశ్నలు అడిగింది.
పవన్ కళ్యాణ్ ని మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించింది. దానికి చిరంజీవి కూడా ఆసక్తికర సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ కి చిన్న వయస్సు నుంచి ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వెంటనే స్పందించే గుణం ఉంది. ఎక్కువగా సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో తన ఆలోచనలకి నక్శలైట్ లలోకి వేల్లిపోతాడెమో అని భయం వేసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో నిజాయితీగా ప్రజలకి సేవ చేయాలనే గుణంతో ప్రయాణం చేస్తున్నారు. కచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ని గొప్ప నాయకుడుగా మాత్రం చూస్తాం అని చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ మీద ఎన్ని విమర్శలు చేసిన తట్టుకొని నిలబడే శక్తి అతనికి ఉందని చిరంజీవి బలంగా నమ్ముతున్నట్లు అతని మాటల బట్టి అర్ధమవుతుంది.