Mega Family : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసి రిసెప్షన్ పార్టీని సంతోషంగా నిర్వహించారు. ఇక పెళ్లి హడావిడి అనంతరం ఈ జంట తమ పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యాన్స్‌లో ఓ వెలితి ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఈ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వరుణ్ పెళ్లిలో సందడి చేసినప్పటికీ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె పిల్లలు రాకపోవడంతో అభిమానులు బాగా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. వరుణ్ తన పెళ్లికి రేణుని పిలిచినప్పటికీ ఆమె వెళ్లలేకపోయింది. అందుకు గల కారణాలను కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రేణు వివరించింది. అయితే రేణు పెళ్లికి వెళ్లనప్పటికీ కనీసి పవన్ కుమారుడు అకీరా కానీ కూతులు ఆధ్యకానీ వెళ్లుంటే బాగుండని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.
పెళ్లి వేడుకల్లో పవన్ కుమారుడు అకీరా నందన్ రాని లోటు మెగా ఫ్యాన్స్ ని ఇప్పటికీ ఎంతో బాధపెడుతోందట. మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోల్లో పవన్ పిల్లలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఇదే క్రమంలో అభిమానుల ఈ లోటును తీర్చించేందుకు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ న్యూస్ ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ ఈమధ్యకాలంలో నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వరుణ్-లావణ్యల పెళ్లికి సంబంధించిన విషయాలు, మెగా ఫ్యామిలీ రిలేటెడ్ అప్డేట్స్ ఎక్కడ కనిపించిన సరే అవి జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తతుం వరుణ్-లావణ్యల కపుల్స్ హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. దాదాపు 7 దేశాలను చుట్టేసి హనీమూన్‌ని ఎంజాయ్ చేయాలని ఈ కొత్త జంట భావిస్తుందట. ట్రిప్ ముగించుకుని ఇండియా రాగానే మరో ఓ గ్రాండ్ ఇవ్వాలని ఈ జంట ప్లాన్స్ చేస్తోందని సమాచారం. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ మాత్రమే ఎంజాయ్ చేసేలా హోస్ట్ చేయబోతుందట వరుణ్ లావణ్య జంట. ఈ క్రమంలో ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా నందన్, ఆధ్యాలు కూడా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా పార్టీకి అటెండ్ కావాలని ఇన్విటేషన్ ఇచ్చారట. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీలో ఆధ్యాని, అకిరాని పవన్‌తో చూడబోతున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.