Mega 157 : చిరంజీవి, వశిష్ఠ సినిమాలో హీరోయిన్‌ని త్రివిక్రం ఫిక్స్ చేశారా..?

Mega 157 : విజయదశమి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబినేషన్‌లో భారీ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్‌ని మాటల మాంత్రీకుడు త్రివిక్రం ఫిక్స్ చేశారా..? అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. చిరంజీవి ఈ ఏజ్ లో కూడా వరుసగా సినిమాలు కమిటవుతూ జెట్ స్పీడ్ లో వాటిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే, ఆచార్య, బోళా శంకర్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా వాల్తేరు వీరయ్య మాత్రం మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించింది.

ఈ క్రమంలో చిరంజీవి తన కొత్త చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారి ఆఫీసులో ప్రారంభించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గతంలో సినిమాను సాంగ్ రికార్డింగ్ తో ప్రారంభించేవారు. ఇప్పుడు మెగా 157 ని కూడా అదే పద్ధతిలో ప్రారంభించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చంద్రబోస్ సాహిత్యం సమకూర్చుకున్నారు. మొదటి పాట రికార్డింగ్ తో చిత్రాన్ని ప్రారంభించారు. బింబిసార చిత్రంతో భారీ హిట్ అందుకున్న వశిష్ఠ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటాడని మాత్రం ఊహించలేదు.

mega-157-has-trivikram-fixed-the-heroine-in-chiranjeevi-and-vashishthas-movie

Mega 157 : సంయుక్త మీనన్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ దర్శకుడు చిరంజీవిని రెండవ సినిమాకే డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోలేదు. మెగా 157 ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం అని యూనిట్ తో పాటు మెగాస్టార్ చెబుతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థ. ప్రభాస్, రామ్ చరణ్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ కారణంగానే మెగా 157 చిత్రానికి శ్రీకారం చుట్టారు.

mega-157-has-trivikram-fixed-the-heroine-in-chiranjeevi-and-vashishthas-movie

ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ హీరోయిన్ ఎవరా..? అందరూ ఆరా తీస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గురూజీ త్రివిక్రం శ్రీనివాస్ ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్న సంయుక్త మీనన్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. సంయుక్త గనక అయితే, త్రివిక్రం అన్నీ చూసుకుంటారని చెప్పుకుంటున్నారు. బింబిసార, భీమ్లా నాయక్, విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా మారింది. అందుకే ఇప్పుడు మెగా 157 కోసం ఈ మలయాళ బ్యూటీని అనుకుంటున్నారట.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.