Movies: ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వచ్చిందంటే సినిమా సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు ఏకంగా సంక్రాంతి బరిలో తమ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అయితే ఫెస్టివల్ సీజన్ తో పాటు సెలవులు కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు, యువత కూడా సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఈ కారణంగానే సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసుకొని స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలా రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి.
ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి వంద కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో, చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తుంది. చాలా కాలం నుంచి టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథలు రావడం లేదు. వచ్చిన సినిమాలు కూడా స్ట్రాంగ్ కంటెంట్ లేక డిజాస్టర్ అవుతున్నాయి.
అయితే ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన రెండు సినిమాలు పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాలుగానే ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. బాలయ్య నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశించి సినిమాకి వెళ్తారో అవన్నీ పుష్కలంగా వీరసింహారెడ్డి సినిమాలో ఉన్నాయి. పవర్ ఫుల్ మాస్ ఎలివేషన్ సన్నివేశాలతో పాటు ఈ సారి పవర్ ఫుల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా వీరసింహారెడ్డి మూవీలో ఉండటం విశేషం. సినిమాలో బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్ రోల్ పోషించాడో అంతే స్థాయిలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా ఉండటం విశేషం. కామన్ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి ఎవరేజ్ రెస్పాన్స్ వస్తుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన వాల్తేర్ వీరయ్య మూవీకి అయితే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పూనకాలు లోడింగ్ అన్నట్లుగానే చిరంజీవి గత నాలుగు సినిమాలని మించిపోయే విధంగా ఈ మూవీ ఉందనే మాట వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఒకప్పటి మెగాస్టార్ ని ఈ సినిమాలో చూసాం అనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, చిరంజీవి టైమింగ్ కామెడీ కూడా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. అలాగే బాస్ డాన్స్ లో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదని ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. మొత్తానికి టాలీవుడ్ ఈ సారి మాత్రం ప్రేక్షకులకి మాస్ జాతరని ఈ రెండు సినిమాలు చూపించి అలరించబోతున్నాయని అర్ధమవుతుంది.