Biogas: ప్రపంచంలో రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఓ వైపు పరిశ్రమల నుంచి విపరీతమైన కాలుష్యం వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మరో వైపు మానవ అవసరాల కోసం తయారు చేసుకున్న వాహన యంత్రాలు ద్వారా కూడా విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది. ఈ వాహన వినియోగం ప్రజల అవసరాలలో భాగం అయిపోయాయి. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవారు ఇప్పుడు బైక్ మీద తిరుగుతున్నారు. ఒకప్పుడు బైక్ లు వాడేవారు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ప్రపంచంలో జనాభాతో సమానంగా వాహనాలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఏ స్థాయిలో కాలుష్యం బయటకి పంపింగ్ అవుతుందో అంచనా వేయడం కష్టం.
ఇక కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కోట్లాది మంది ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచం మరింత అడ్వాన్స్ అవుతున్న కొద్ది వాహనాల కోసం ఉపయోగించే ఇంధనం విషయంలో మరింత కేర్ ఫుల్, వాతావరణంలో మార్పులని దృష్టిలో ఉంచుకొని ఆటోమొబైల్ దిగ్గజాలు వాహనాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఉన్న చిన్న చిన్న లోపాలని అధికమిస్తూ మరింత బెటర్ వెర్సన్స్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
2030 నాటికీ ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య పెరిగి ఇంధన వాహనాలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ అయిన మారుతి ఎలక్ట్రికల్ వాహనాలతో మరో రకమైన ఇంధనాన్ని కూడా ఉపయోగించే వాహనాలని మార్కెట్ లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టాయి. అదే ఆవుపేడతో తయారయ్యే బయోగ్యాస్ వెహికల్స్ పై దృష్టి సారించాయి. దీనికి సంబందించిన ప్రాజెక్ట్ కి ఇప్పటికే మొదలు పెట్టింది. ఆవు పేడ భవిష్యత్తులో పెద్ద ఇంధన వనరుగా మార్చడంతో పాటు దానితో తయారయ్యే బయోగ్యాస్ తో నడిచే కార్లని మార్కెట్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. భవిష్యత్తులో ఇదొక గొప్ప మార్పు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పశువుల పెంపకం ఎక్కువగా ఉంటుంది వాటి నుంచి వచ్చే వ్యర్ధాలని బయోగ్యాస్ వనరుగా మార్చి సీఎన్జీ మోడల్ కార్లని వినియోగిస్తామని మారుతి సుజుకి చెప్పింది.
భారత్ లో ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న సీఎన్జీ కార్లలో 70 శాతం మారుతి సుజుకి సంస్థకు చెందినవి ఉండటం విశేషం. ఇక ఈ మోడల్స్ ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, జపాన్ లలో కూడా నడుస్తున్నాయి. భవిష్యత్తులో కార్భన్ ఉద్గారాలని తగ్గించే దిశగా ఆటోమొబైల్ రంగం అడుగులు వేస్తుందని, అందులో బయోగ్యాస్ అతిపెద్ద ఇంధనంగా ఎలక్ట్రిసిటీ తర్వాత మారుతుందని మారుతి సుజుకి పేర్కొంది. దీనికోసం ఇప్పటికే బయో గ్యాస్ ఉత్పత్తి కోసం ఇండియాలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, బనాస్ డెయిరీతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అలాగే ఆవుపేడతో తయారయ్యే ఇంధనం తయారు చేసే కంపెనీతో జపాన్ లో ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఈ బయోగ్యాస్ ని ఇంధన వనరుగా గ్రామీణ ప్రాంతాలలో విరివిగా ఉపయోగించే వారు. మళ్ళీ దాంతో నడిచే కార్లని మారుతి మార్కెట్ లోకి తేవడం నిజంగా ఆసక్తికర విషయం అని చెప్పాలి.