Spirituality: శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం మంగళవారం అలాగే శుక్రవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణ సోమవారం పెద్ద ఎత్తున శివుని ఆరాధిస్తూ పూజిస్తుంటాము ఇక శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం ఆచరించడం వల్ల ఆ పార్వతీదేవి అనుగ్రహం మనపై ఉండి దీర్ఘ సుమంగళీగా ఉంటారని భావిస్తారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవిని ఎంతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు.
ఈ విధంగా శ్రావణమాసంలో పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలను ఆచరిస్తూ ఉంటాము. ఇకపోతే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ మంగళ గౌరీవ్రతాన్ని వివాహమైన స్త్రీలు చేయడం వల్ల తమ పసుపు కుంకములు పదికాలాలపాటు చల్లగా ఉంటాయని భావిస్తారు. అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వారు కూడా మంగళ గౌరీ వ్రతం చేయటం వల్ల తొందరగా వివాహం కావడమే కాకుండా మంచి భర్త దొరుకుతాడని నమ్ముతారు.
ఇక శ్రావణ మంగళవారం గౌరీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ఆ రోజున వివాహిత స్త్రీలు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల తమ సౌభాగ్యం పదికాలాలపాటు చల్లగా ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మంగళవారం వివాహిత స్త్రీలకు తోరణాలను దానం చేయడం ఎంతో మంచిది. అదే విధంగా సుమంగళీగా ఉన్నటువంటి వారికి గాజులను దానం చేయటం మంచిది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు కుంకుమలను అందించడం వలన భర్తకు వచ్చే ప్రతి సంక్షోభం తొలగిపోయి భర్త ఆయుష్షు పెరుగుతుంది. అలాగే కాటుకను దానం చేయటం వల్ల మనపై ఉన్నటువంటి చెడు దృష్టి మొత్తం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.