Thu. Jan 22nd, 2026

    Sankranthi: తెలుగువారికి పెద్ద పండుగ అయినటువంటి వాటిలో సంక్రాంతి పండుగ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులపాటు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి మనకు ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. సూర్యుడు కర్కాటక రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా తెలుగువారికి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ రోజు కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి సంక్రాంతి రోజు దానం చేయాల్సినటువంటి వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే…

    makar-sankranti-these-donations-will-bring-you-wealth-health
    makar-sankranti-these-donations-will-bring-you-wealth-health

    సంక్రాంతి పండుగ రోజు తప్పనిసరిగా నల్ల నువ్వులను దానం చేయడం ఎంతో మంచిది ఇలా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల అన్ని పాపాలు హరించకపోతే అదేవిధంగా శుభపరిణామాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక నువ్వులను దానం చేయలేని వారు నువ్వులతో తయారు చేసిన చలివిడిని దానం చేయడం ఎంతో మంచిది. ఇక సంక్రాంతి పండుగకు రైతులకు అన్ని పంటలు చేతికి వచ్చి ఉంటాయి కనుక వారికి పండిన పంటలను పండుగ రోజు దానం చేయటం శుభ పరిణామం.

    ఇక పెళ్లి కాని వారు పెళ్లి జరిగి సంతానం లేనటువంటి వారు మినుములను దానం చేయటం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. వీటితోపాటు పెరుగు దానం చేయడం కూడా ఎంతో మంచిది. ఇలా సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులను దానం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక పండుగ రోజు ఎవరైనా యాచకులు వస్తే తప్పనిసరిగా వారికి దానం చేయడం ఎంతో మంచిది.