Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ దేవదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ నేపథ్యంలోను సోమవారం పరమశివుడికి అంకితం చేయబడింది. సోమవారం స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకాలు అలంకరణలతో పూజిస్తూ శివయ్య కరుణ కటాక్షాలను పొందుతూ ఉంటారు. అయితే నేడు జూలై 13 మాత్రం అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పాలి.జులై 13న వచ్చే సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలయికతో. వచ్చింది.
ఇలా ఆరుద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశ మాస శివరాత్రితో కలిసి సోమవారం రావటం వల్ల ఈ సోమవారం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ సోమవారం శివుడిని పూజించడం వల్ల 100 శివరాత్రులతో సమానంగా శివుడిని పూజించిన ఫలితం లభిస్తుంది. ఈ అరుదైన రోజున శివుడిని భక్తితో పూజించి, శివలింగానికి అభిషేకం చేసి పూజించటం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు మనపై ఉండటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తొలగించి అష్టైశ్వర్యాలను కలిగిస్తారని భావిస్తారు. అదేవిధంగా మీ దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని పూజించడం ఎంతో మంచిది. ఇక ఆలయానికి వెళ్లలేని వారు ఈ పూజ చేయడం మంచిది.
ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసిన అనంతరం శివుడి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకోవాలి స్వామి వారికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయడం మంచిది. ఇంట్లో శివలింగం ఉన్నవారు పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. నేడు శివుడికి అభిషేకం చేయటం వల్ల ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇలా అభిషేకం అనంతరం స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పటించాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇక స్వామివారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు. ఇలా జులై 13న మహాశైవాక్షయోగం ఏర్పడింది. మరి ఇలాంటి అద్భుతమైన పవిత్రమైన రోజు 2053,అలాగే 2070 లో వస్తుంది. అందుకే ఇలాంటి పవిత్రమైన రోజున శివుడిని ఆరాధించడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.