Lord Shiva: ముల్లోక అధిపతి అయినటువంటి పరమేశ్వరుడిని ప్రతి సోమవారం చాలామంది భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా ఈశ్వరుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శివయ్య అనుగ్రహం మనపై ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే శివుడికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను నియమాలను పాటిస్తూ పూజ చేయాలి లేకపోతే శివ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.ముఖ్యంగా సోమవారం శివుడికి చాలామంది అభిషేకాలను నిర్వహిస్తూ పూజలు చేస్తూ ఉంటారు.
ఇలా స్వామివారికి పూజ చేసే సమయంలో కొన్ని రకాల పదార్థాలను ఏమాత్రం ఉపయోగించకూడదు. మరి శివ పూజలో ఉపయోగించకూడని ఆ పదార్థాలు ఏంటి అనేక విషయానికి వస్తే… శివుడికి పూజించే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా వినాయకుడిని పూజించి అనంతరం శివుడికి పూజ చేయాలి.ఇక శివుడికి పూజ చేసే సమయంలో మన ఇంట్లో శివుడి చిత్రపటాలను పెట్టుకుని పూజించడం ఎంతో మంచిది అయితే చాలామంది శివలింగం పెట్టుకొని పూజిస్తూ ఉంటారు.ఎవరైతే శివలింగం పెట్టుకొని పూజిస్తూ ఉంటారో అలాంటివారు తప్పనిసరిగా శివలింగంపై జలధారపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Lord Shiva:
ఇలా జరదార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఆ శుభం కలుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇక శివుడి కోసం ఉపయోగించే వాటిలో బిల్వ దళాలు తప్పనిసరిగా ఉండాలి. స్వామివారికి బిల్వ దళాలు, వెలగపండు ఎంతో ఇష్టమైనది కనుక వీటిని శివ పూజలో ఉపయోగించడం ఎంతో మంచిది.ఇక పారిజాత పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోనూ శంకు పుష్పాలతోనూ కలువ పుష్పాలతో పూజ చేయకూడదు. అదేవిధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో కుంకుమ ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకూడదు. ఇక తులసిమాలను కూడా స్వామివారికి అసలు ఉపయోగించకూడదు. ఇక స్వామివారికి పూజ చేస్తున్న అనంతరం కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లను శివలింగంపై ఎలాంటి పరిస్థితులలోను పోయకూడదు ఇలా శివలింగాన్ని పూజించే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని పూజించడం ఎంతో శుభ సూచకం.