Thamalapaku Deepam: సాధారణంగా ప్రతి ఒక్కరు పూజ చేసే సమయంలో వివిధ రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మనం దీపం వెలిగించేటప్పుడు ఒట్టి ప్రమిదను వెలిగించకూడదు దీపం కింద ఏదో ఒకటి ఆధారం పెట్టి వెలిగించినప్పుడే ఫలితాలు అందుతాయి. ఈ క్రమంలోనే చాలామంది తమలపాకు దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇలా తమలపాకును ఆధారంగా చేసుకుని తమలపాకుపై దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు.మరి తమలపాకులపై దీపం ఎలా వెలిగించాలి ఇలాంటి దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ముందుగా ఆరు తమలపాకలను కాండంతో సహా తీసుకొని శుభ్రం చేయాలి అయితే ఈ తమలపాక కాడలను తుంచి పక్కన పెట్టుకోవాలి.ఈ తమలపాకులను దేవుడి గదికి తీసుకెళ్లి అక్కడ ఒక పీఠవేసి దేవుడికి ఎదురుగా నెమలి పించం ఆకారంలో వాటిని అమర్చుకోవాలి. ఇలా నెమలి పించం ఆకారంలో ఈ ఆరు తమలపాకులను ఉంచి దానిపై మట్టి ప్రమిద పెట్టి అందులో తుంచిన ఆరు తమలపాకుల కాడలను అలాగే నువ్వుల నూనెను వేసి దీపారాధన చేయాలి.
Thamalapaku Deepam:
ఈ విధంగా తమలపాకు దీపం వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా తొందరగా పూర్తి అవుతాయి అలాగే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు లేకుండా సంతోషంతో ఉంటారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ తమలపాకు కాడలో పార్వతి దేవి కొలువై ఉంటుంది తమలపాకు చివరన లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే తమలపాకు పై దీపం వెలిగించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.