Spirituality: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల దేవత విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పోషిస్తూ ఉంటాము. ఇలా దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండి ప్రతిరోజూ పూజ చేయటం వల్ల ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని అలాగే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా లేదా పొరపాటున కూడా మన చేతుల నుంచి దేవుడు చిత్రపటాలు లేదా విగ్రహాలు కింది పడిపోవడం జరుగుతుంది.
ఇలాంటి దేవుని విగ్రహాలు కనుక కింద పడిపోతే విరిగిపోతూ ఉంటాయి. ఇలా విరిగిపోయిన విగ్రహాలను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే మంచిదేనా లేకపోతే దేవుడి విగ్రహాలు పగిలిపోవడం చెడుకు సంకేతమా అనే సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. మరి విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉండటం మంచిదేనా ఈ విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారనే విషయానికి వస్తే..
విరిగిపోయిన విగ్రహాలు దేవుడి గదిలో ఉండకూడదని పండితులు చెబుతున్నారు అసలు ఇలాంటి విగ్రహాలు కనుక ఇంట్లో ఉంటే ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ వ్యాప్తి చెంది అవకాశాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు విరిగిపోయిన చిత్రపటాలు దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉంటే వెంటనే పడేయటం మంచిది. ఇలాంటి విరిగిపోయిన పగిలిపోయిన విగ్రహాలను పారుతున్న నీటిలో నిమజ్జనం చేయాలి.ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు లేకపోతే ఇంట్లో సమస్యలు ఏర్పడటం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం వంటివి తలెత్తుతూ ఉంటాయి.