Health care: ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారిలో కూడా గుండె జబ్బు సమస్యలు అధికంగా ఉన్నాయి. అయితే మనం తీసుకునే ఆహారం మారిన జీవనశైలి ఆధారంగా ఇలాంటి సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ విధంగా గుండె జబ్బులు బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా ప్రతి ఏడాది అధికమవుతుంది. ముందుగానే మనం ఈ సమస్యను కనుక గుర్తిస్తే ఈ మరణాలను చాలా వరకు తగ్గించవచ్చు మరి గుండె జబ్బు ఉందని ఎలా తెలుసుకోవాలి మన శరీరంలో ఏ విధమైనటువంటి లక్షణాలు కనబడతాయి అనే విషయానికి వస్తే..
గుండె జబ్బు సమస్య ఉంటే కనుక ఆ లక్షణాలు మన పాదాలలో తప్పనిసరిగా కనిపిస్తాయి ఉన్నఫలంగా పాదాలు వాపు రావటం కాలి చీలిమండలు రావటం వంటివి జరిగాయి అంటే మీకు గుండె జబ్బులు ఉన్నట్టేనని అర్థం. గుండె బలహీనపడి మన శరీర దిగువ భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది తద్వారా కాళ్లు వాపు రావటం అలాగే పాదాల రంగు మారడం వంటివి జరుగుతుంది. ఎప్పుడైతే పాదాలు నీలి లేదా పసుపు రంగులో ఉన్నాయో అప్పుడు మీ గుండె బలహీన పడినట్లేనని అర్థం.
ఇకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా కాసేపు నిలబడిన కాళ్లల్లో పెద్ద ఎత్తున నొప్పి కలుగుతుంది. కాళ్లల్లో జలదిరింపు రావడం తిమ్మిర్లు ఏర్పడటం కూడా గుండె జబ్బు కారణాలేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవే కాకుండా చాతిలో నొప్పి, శ్వాస ఆడక పోవడం, తొందరగా అలసిపోవడం వంటి లక్షణాలు కూడా కొంతమందిని కనిపిస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం ఎంతో మంచిది.