Lavanya-Varuntej : మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ల పెళ్లి సందడి ఇటలీలో జరిగిన కాక్ టైల్ పార్టీ తో షురూ అయ్యింది. పార్టీ లో మెగా హీరోలు ఓ రేంజ్ లో సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ కాక్ టైల్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ పార్టీ కి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్యల పెళ్లి వేడుకలు ఇటలీలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి . గత రాత్రి బోర్గో సాన్ ఫెలిస్ రిసార్ట్ లో కాక్టైల్ పార్టీ ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఉదయం హల్దీ వేడుక పూర్తి అయ్యింది. సాయంత్రం మెహందీ వేడుకలు జరుగనున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, అల్లువారి ఫ్యామిలీ ఇటలీకి చేరుకున్నారు. అందరూ రాత్రి జరిగిన కాక్ టైల్ పార్టీ లో పాల్గొన్నారు.ఈ పార్టీ లో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తమ భార్యలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ పార్టీ లో మెరిశాడు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో మెగా ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. మెగా, అల్లు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూస్తూ అభిమానులు మురిసిపోతున్నారు. క్యా సీన్ హే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నవంబర్ 1న మధ్యాహ్నం 2:48 కి కుటుంబ సభ్యుల ఆశీస్సులతో వరుణ్, లావణ్యలు మూడు ముళ్లతో ఒక్కటి కాబోతున్నారు.. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే ఈ పెళ్లి కి హాజరవుతున్నారు.
అటు వరుణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి రోజే 8 రిసెప్షన్ పార్టీ కూడా జరగనుంది. పెళ్లి తంతు పూర్తయ్యాక నవంబర్ 3న అందరూ భారత్ కి తిరిగి రానున్నట్లు సమాచారం. భారత్ కి వచ్చాక సినీ ఇండస్ట్రీ లోని సెలబ్రిటీలకు పార్టీ ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.