Lavanya tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత భళే భళే మగాడివోయ్..సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యక ఇమేజ్ ను సొంతం చేసుకున్ని లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్‌ని గత ఏడాది ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఓ వెబ్ సిరీస్ కేడా చేసింది లావణ్య. అది కాస్త పెద్దగా హిట్ కాకపోవడంతో ప్రస్తుతం మెగా కోడలు స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అయితే లావణ్య చేసిన ఓ పనికి ఇప్పుడు నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని ఒక బిజినెస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బిజినెస్ కోసం ఉపాసన కొణిదెల గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అంజనమ్మ, సురేఖమ్మ అత్తమ్మాస్ కిచెన్ కోసం ఫుడ్ ప్రొడక్టట్స్ తయారు చేస్తూ ఉంటే.. ఉపాసన వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. సరదాగా సాగే ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో లేటెస్టుగా అత్తమ్మాస్ కిచెన్ ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి,నాగబాబు భార్య పద్మమ్మ కలిసి ఆవకాయ్‌ను తయారు చేస్తూ కనిపించారు. అయితే ఇద్దరూ కూడా ఎలాంటి నియమాలు పాటించకుండా చేతులకు గ్లౌజులు వేసుకోకుండా, తల విరబోసుకుని ఆవకాయను కలుపుతుండటంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. నెటిజన్స్ ట్రోలింగ్ తో పాటు అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్‌ల నాణ్యత మీద ఫిర్యాదులు ఇస్తున్నారు. అలా జుట్టుని వదిలేసి ఆవకాయ కలుపుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రాడక్ట్స్ విషయంలో హైజీన్ మెయింటైన్ చేయడం లేదని తిట్టిపోస్తున్నారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ టీం రంగంలోకి దిగి నెటిజన్ల కామెంట్లకు రిప్లై ఇచ్చింది. అది అమ్మడానికి చేస్తున్నది కాదని మా ఇంటి కోసం అని సమాధానం చెప్పి నెటిజన్స్ ను కూల్ చేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.