Anushka : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో ఈ భామ తెలుగు తెరకు పరిచయమైంది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఆ ఒక్క సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది స్వీటీ. అరుంధతి తర్వాత అనుష్కకు తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఛాన్సులను అందుకుంది. ప్రిన్స్ మహేష్ తో ఖలేజా, ప్రభాస్ తో మిర్చి , బాహుబలి వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. బాహుబలి సినిమాతో ఈ బ్యూటీ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించింది. ఈ చిత్రం తర్వాత అనుష్క రేంజ్ మారిపోతుందని అనుకున్నారు. కానీ సైజ్ జీరో సినిమా కోసం ఆమె చేసిన ప్రయోగం కాస్త బెడిసికొట్టడంతో ప్రేక్షకులను పులకరించడమే గగనం అయింది.
కాస్త గ్యాప్ తీసుకుని ఈ అనుష్క నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలు చేసి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఆ సినిమాలు అంతగా హిట్ టాక్ సాధించలేదు. ఈ క్రమంలో ఈ బ్యూటీ పెళ్లి గురించి ఓ రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే గతంలో ప్రభాస్ తో అనుష్క పెళ్లి ఫిక్స్ అని అనేక రూమర్స్ వచ్చాయి. వాటిపైన అటు ప్రభాస్ కానీ, ఇటు అనుష్క కానీ స్పందించలేదు. దీంతో అదంతా ఫేక్ అని తేలిపోయింది. ఇక ఇఫ్పుడు ఆమె పెళ్లి గురించిన మరోసారి చర్చ జరుగుతోంది. అదేమంటే 42 ఏళ్ల అనుష్క కన్నడ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ సమాచారంలో నిజామా కాదా అన్న క్లారిటీ అయితే ఇంకా లేదు. వాస్తవానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో పెళ్లి గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని చెప్పింది. ఇక ఇప్పుడు నిజంగా అనుష్క పెళ్లి అవుతుందా? లేక కేవలం రూమరేనా అనేది తెలియాల్సి ఉంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.