Thu. Jan 22nd, 2026

    KVS Recruitment : కేంద్రీయ విద్యాలయ సంగతన్ హిందీ ట్రాన్స్‌లేటర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం కాల్ లెటర్‌లను విడుదల చేసింది. హిందీ ట్రాన్స్‌లేటర్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూలను మే 17, 18వ తేదీన నిర్వహించనున్నారు.

    kvs-recruitment-for-hindi-translator-and-assistant-engineer-posts
    kvs-recruitment-for-hindi-translator-and-assistant-engineer-posts

    అయితే అసిస్టెంట్ ఇంజనీర్ స్థానానికి ఇంటర్వ్యూను మే 28న నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి తమ KVS హిందీ ట్రాన్స్‌లేటర్ కాల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. KVS అసిస్టెంట్ ఇంజనీర్ కాల్ లెటర్ ను పొందవచ్చు.

    ఇంటర్వ్యూకు ఏం ఏం తీసుకెళ్లాలి? :

    అభ్యర్థులు ఇంటర్వ్యూ రోజున KVS హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ ఇంజనీర్ కాల్ లెటర్ 2023 తో పాటు ఇతర అవసరమైన పత్రాలను తీసుకెళ్లడం తప్పనిసరి. అభ్యర్థులు షెడ్యూల్ చేసిన తేదీన సమయానికి ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి.

    kvs-recruitment-for-hindi-translator-and-assistant-engineer-posts
    kvs-recruitment-for-hindi-translator-and-assistant-engineer-posts

    కాల్ లెటర్ ని ఇలా డౌన్‌లోడ్ చేయండి :

    * కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
    * హోమ్‌పేజీలో అనౌన్స్‎మెంట్ విభాగం కోసం సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
    * కేవీఎస్ హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ ఇంజనీర్ కాల్ లెటర్ 2023 లింక్‌ని క్లిక్ చేయండి.
    * రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
    * లాగిన్ చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
    * కాల్ లెటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
    * మీ డివైస్ లో కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయండి.
    * భవిష్యత్తు రిఫరెన్స్ కోసం కాల్ లెటర్ ప్రింట్ అవుట్ ను తీసుకోండి.