Kubera: ఇప్పటి సినిమాల ట్రెండ్ చూస్తే వీకెండ్ వరకే కలెక్షన్ల హవా కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వారాంతం తర్వాత క్రేజ్ కోల్పోతుంటాయి. వచ్చే వారం నాటికి కొత్త సినిమాలు విడుదలై పాత చిత్రాలను వెనక్కి నెట్టి ముందుకు వస్తుంటాయి. అయితే ఈ వీకెండ్ మాత్రం ఈ ట్రెండ్‌కి భిన్నంగా మారింది. కొత్తగా వచ్చిన సినిమాలు ఆక్యుపెన్సీ పరంగా అంతగా మెప్పించకపోవడం, పాత సినిమా ఓ రేంజ్‌లో నడుస్తుండటం విశేషం.
ఈ నెల రెండు వారాల క్రితం రిలీజ్ అయిన ‘కుబేర’ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా నడుస్తోంది. వర్కింగ్ డేస్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా, వీకెండ్ రాగానే ధనుష్-నాగ్ కాంబో ఆకర్షణతో మల్టీప్లెక్స్‌ల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి మెట్రోల్లో ‘కుబేర’కి రెస్పాన్స్ బాగుంది. మళ్లీ కొత్త సినిమాల కంటే పాత సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం అరుదైన విషయమే.
ఇక ఈ వీకెండ్‌లో వచ్చిన ‘తమ్ముడు’ సినిమా మాత్రం తొలి షో నుంచే నెగెటివ్ టాక్‌తో ఢీలా పడిపోయింది. శని, ఆదివారాల్లో కూడా వసూళ్లు పెద్దగా ఆశాజనకంగా లేకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రమోట్ చేయడాన్ని తగ్గించినట్టు తెలుస్తోంది. అలాగే గత వారం వచ్చిన ‘కన్నప్ప’ కూడా ఫస్ట్ వీకెండ్ తర్వాత గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఈ వారం కొత్త బూస్ట్ లేకపోవడంతో మరింతగా కూలిపోయింది. వీకెండ్ వచ్చినా ఆక్యుపెన్సీ పెరగకపోవడం ఆ సినిమా పరిస్థితిని బట్టే తెలుస్తోంది.
అన్ని సినిమాలను వెనక్కి నెట్టి, రెండు వారాల పాత సినిమాగా ‘కుబేర’ తిరిగి లీడ్ తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ సినిమా తమిళ వెర్షన్ మాత్రం తొలి వీకెండ్ తర్వాత పూర్తిగా ఫ్లాప్ అయిపోయింది. అక్కడ డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగులో మాత్రం సూపర్ హిట్ స్థాయికి చేరడం విశేషమే.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.