Karthika Pournami: ప్రతి ఏడాది మన హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున శివ కేశవుల నామస్మరణ చేస్తూ పూజించడం వల్ల వారి ఆశీర్వాదం మనపై ఉంటుందని ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇలా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనదిగా భావిస్తారు మరి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఈ పౌర్ణమి ఘడియలు ఎప్పుడు ఏంటి అనే విషయానికి వస్తే..
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నవంబర్ 27వ తేదీ 2023 సోమవారం వచ్చింది. ఈ రోజున పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి వేడుకలను జరుపుకోబోతున్నారు కార్తీక పౌర్ణమి వేడుకలకు సరైన సమయం ఎప్పుడు ఏంటి అనే విషయానికి వస్తే కార్తీక పౌర్ణమి ఘడియలు నవంబర్ 26, 2023 ఆదివారం మధ్యాహ్నం 03:53 గంటలకు ప్రారంభమై నవంబర్ 27, 2023 సోమవారం మధ్యాహ్నం 02:45 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, 27 నవంబర్ 2023 సోమవారం నాడు పూర్ణిమ ఉపవాసం, స్నానం ఆచరిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయమే నిద్ర లేచి నది స్నానాలను ఆచరించిన తర్వాత శివకేశవలకు పూజ చేయాలి అనంతరం స్వామివారికి పండ్లను నైవేద్యాలుగా సమర్పించి దీపాలను ఆవు నెయ్యితో వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఆ శివ కేశవుల అనుగ్రహం మన పైనే ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసాలు ఉన్నటువంటి వారు రాత్రి చంద్రుడికి పాలతో ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత భోజనం చేయడం మంచిది ఇక కార్తీక పౌర్ణమి రోజు దానధర్మాలను చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.