Karthika Masam: కార్తీకమాసం ఆ శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన నెలగా భావిస్తారు. అందుకే కార్తీకమాసం వచ్చింది అంటే శైవ, శివ ఆలయాలలో పెద్ద ఎత్తున శివనామ స్మరణలతో మారుమోగుతూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా కార్తీకమాసంలో ఆలయాలలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కూడా నెలకొని ఉంటుంది. ఇకపోతే కార్తీక మాసంలో కనుక మన ఇంట్లో కూడా కొన్ని నియమాలను కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఏర్పడటమే కాకుండా ఇంటిల్లపాది కూడా ఎంతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
మరి కార్తీక మాసంలో ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయానికి వస్తే కార్తీకమాసంలో శివుడికి విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇక కార్తీకమాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి కోటకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించి తులసి చాలీసా చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.
కార్తీక సోమవారంలో శివుడికి ప్రత్యేకంగా పూజలు చేయడం ఎంతో మంచిది. ఇక కార్తీక శుక్రవారం అష్ట లక్ష్మి వ్రతం ఆచరించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇక కార్తీకమాసంలో ప్రతిరోజు ఇంటి గుమ్మం వద్ద దీపాలు వెలిగించడం ఎంతో మంచిది అలాగే పూజ చేసిన తర్వాత పూజ గదిలో కర్పూరం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించడానికి కార్తీకమాసంలో ప్రతిరోజూ గంగాస్నానం చేయాలి. అయితే నది దగ్గరగా లేనివారు రోజూ స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం కలుపుకోవచ్చు. ఇక కార్తీకమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.