Categories: LatestNewsPolitics

TDP: డేట్ కన్ఫర్మ్ చేసుకున్న కన్నా… అతని బాటలో మరో లీడర్ కూడా

TDP:  ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తమ క్యాడర్ ని సిద్ధం చేసుకొని వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాన పార్టీలలో స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీలో జాయిన్ అయ్యి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీలో కూడా చేరే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలోకి ఒకప్పటి నాయకులకి సంబందించిన చరిత్రని చూసుకొని పవన్ కళ్యాణ్ చేర్చుకుంటున్నారు. అవినీతి నేపధ్యం ఉన్నవారు వస్తానని చెప్పిన కూడా కుదరదు అని చెప్పేస్తున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆ పార్టీని వీడి జనసేనలోకి రావాలని ప్రయత్నం చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి లభించకపోవడంతో ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. టీడీపీలో ఈ నెల 23న చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు సమక్షంలో తనతో పాటు రెండు వేల మంది వరకు పార్టీలో చేరుతారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా విశాఖకి చెందిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా కన్నా లక్ష్మినారాయణతో కలుసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కూడా తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కన్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. అలాగే విష్ణుకుమార్ రాజు వస్తే విశాఖలో దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ స్థానాన్ని అతనికి అప్పగించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.