Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి నెటిజన్స్ వార్నింగ్ ఇస్తున్నారా..? అంటే అది వార్నింగ్ కాకపోయినా ఇంకోసారి సౌత్ సినిమాలలో కనిపించ వద్దని మాత్రం కాస్త ఘాటుగానే కామెంట్స్, సజషన్స్ ఇస్తున్నారట. దీనికి కారణం కంగనా నటించిన ఏ సౌత్ సినిమా కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోకపోవడమే. ఎన్నో కష్టాలు పడి కంగనా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా నిలబడింది. చాలామంది స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది.
చెప్పాలంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి వారి సినిమాలకి తన సోలో సినిమా పోటీ వచ్చేంత క్రేజ్ తెచ్చుకుంది. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాలో, మీడియాలో కాంట్ర వర్సీలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ఉన్న క్రేజ్ ను కాస్త డ్యామేజ్ కూడా చేసుకుంది. కంగనా రనౌత్ కి నోటి దురుసు బాగా ఎక్కువనే మాట బాలీవుడ్ సెలబ్రీటీలు సైతం చెప్పుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, కంగనా ఇలాంటివేవి అసలు పట్టించుకోదు. తన ధోరణిలో తాను మాట్లాడుతూ ఉంటుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్ చూసి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోకిరి సినిమాతో తెలుగు తెరకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ, అప్పుడు కుదరలేదు. అయినా వదలకుండా ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత తమిళంలో తలైవి అనే చిత్రం చేసింది. ఇది జయలలిత బయోపిక్ అని తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.
అయినా మళ్ళీ తమిళ మేకర్స్ కంగనాకి ఛాన్స్ ఇచ్చారు. రజినీకాంత్, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన చంద్రముఖి సీక్వెల్ ను రాఘవ లారెన్స్ తో తెరకెక్కించారు. ఇందులో చంద్రముఖి పాత్ర కంగనా చేసి అబాసుపాలైంది. ఈ సినిమా తర్వాత సౌత్ జనాలు ఇంకోసారి సౌత్ సినిమాలో నటించకపోవడం మంచిదని సలహాలిస్తున్నారు. మరీ మాసివ్ ఆడియన్స్ అయితే, బాలీవుడ్ లో క్వీన్ అయినా కూడా సౌత్ లో మాత్రం జీరో అని హేళన చేస్తున్నారు. కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా ఈ కామెంట్స్ కి ఏకీభవించాల్సిందే.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.