Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాపిక్ ఎలాంటిదైనా, ముందుంది ఎంతటి వారైనా భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా తన అభిప్రాయాన్ని తెలిపి వారిని ఎదురిస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. సినిమా నుంచి పొలిటికల్ వరకు ప్రతి అంశంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడంలో కంగనా వెనుకడుగు వేయదు. ఇండస్ట్రీలోనూ చాలా మంది కంగనా బాధితులు ఉన్నారు. బాలీవుడ్ క్వీన్ రీసెంట్ గా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్ భార్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసి నెట్టింట్లో మంటలు రేపింది. తాజాగా ఈ భామ యానిమల్ డైరెక్ట ర్ పైన తనదైన శైలిలో కామెంట్ చేసింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న సందీప్ వీడియోకు ప్రతిస్పందనగా దయచేసి మీ సినిమాల్లో నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వకండి అంటూ చెప్పి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
డిసెంబర్ లో విడుదలైన యానిమల్ మూవీ ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా చాలా మంది ఈ మూవీకి ప్రతికూల రివ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ రివ్యూయర్స్ తో పాటు చాలా మంది స్టార్ సెలబ్రిటీలు యానిమ్ మూవీపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కూడా ‘యానిమల్’పై ప్రతికూల సమీక్షను ఇచ్చింది. అయితే ఆమె రివ్యూకు రీసెంట్ గా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిప్లై ఇచ్చాడు. తన సినిమాపై నెగెటివ్ రివ్యూ ఇచ్చినా కంగనాతో కలిసి వర్క్ చేయడానికి తాను ఇంట్రెస్టింగ్ గా ఉన్నానని చెప్పాడు. విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి, షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ తో యానిమల్ సినిమాలను తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమాతో ఈ యువ డైరెక్టర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ మూవీకి కొన్ని వివాదాలు , విమర్శలు ఉన్నప్పటికీ సౌత్ స్టార్ డైరెక్టర్లైన రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టులో సందీప్ పేరు చేరింది. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నటిని ఉద్దేశించి చేసిన కామెంట్ అట్టుడికించింది.
వీడియోలో సందీప్ మాట్లాడుతూ…” కంగనా రనౌత్ ‘యానిమల్’పై నెగెటివ్ రివ్యూ ఇచ్చినా తనతో కలిసి వర్క్ చేయాలని ఉంది. ఆమె ఛాన్స్ ఇస్తే , ఆ క్యారెక్టర్ కు సరిపోతుందని అనుకుంటే నేను వెళ్లి ఆమెకు స్టోరీ చెబుతాను. నేను కంగనా సినిమాలు చూశాను. తన యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. అందుకే ఆమె యానిమల్ పై ప్రతికూల వ్యాఖ్యలు చేసినా నేను పట్టించుకోను. నాకు అస్సలు ఆమెపై కోపం రాదు. యానిమల్ లో స్త్రీ విద్వేష సీన్స్ పై కంగన విమర్శించినా పట్టించుకోను”అని సందీప్ తెలిపారు. అయితే దీనిపై కంగనా సెటైరిక్ రిప్లై ఇచ్చింది. ” రివ్యూలు, విమర్శలు ఒకేలా ఉండవు. ఇతరుల కోణం నుంచి ఆర్ట్ ను సమీక్షించాలి. డిస్కస్ చేయాలి. ఇది సాధారణ విషయం. నా రివ్యూ చూసి స్మైలీ ఫేస్ తో సందీప్ నా పట్ల గౌరవం చూపించిన తీరు గొప్పది. ఆయన మ్యాన్లీగా మూవీస్ చేయడమే కాదు, సందీప్ యాటిట్యూడ్ కూడా మ్యాన్లీగానే ఉంది. థ్యాంక్యూ సార్. అయితే నాకు మాత్ర మీ సినిమాల్లో దయచేసి ఏ క్యారెక్టర్ ఇవ్వకండి. లేకపోతే మీ ఆల్ఫా మేల్ హీరోలు స్త్రీవాదులు అయిపోతారు. అలా చేస్తే మీ మూవీస్ కూడా డిజాస్టర్స్ అవుతాయి. మీరు బ్లాక్‌బస్టర్ సినిమాలు చేస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు కావాలి” అని తన స్టైల్ లో ఛమత్కారంగా రిప్లై ఇచ్చింది. దీంతో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.