Kalki : డార్లింగ్ ప్రభాస్ హీరోగా , మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్బోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ , తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఇక మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ తో మొతమోగిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో బుజ్జి పరిచయం చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఈ నెల 10 న ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
డార్లింగ్ కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్ గా మారాడు ప్రభాస్. దీంతో డార్లింగ్ సినిమా వస్తుందంటే చాలు విదేశాల్లో ఉన్న భారతీయులు పండుగ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో కల్కి ఓవర్సీస్ ప్రీమియర్స్ ను జూన్ 26న వేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ ను కూడా గురువారం ప్రారంభించారు. ఇక ఓవర్సీస్ లో ప్రభాస్ కల్కికి క్రేజ్ మామూలుగా లేదు. బుకింగ్స్ ప్రారంభించిన 4 గంటలలోనే ఏకంగా 4200 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఏకంగా కోటి పది లక్షల వరకు కల్కీ మూవీకి వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. దీంతో కల్కీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ సృష్టించినట్లైంది. ఇక ఈ మూవీ స్క్రీన్ మీదకి వచ్చాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచిచూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.