Categories: EntertainmentLatest

Samantha : అమ్మ నాన్న వద్దన్నారు..అయిన వినలేదు

Samantha : ప్రొఫెషనల్ గానే కాదు, వ్యక్తిగతంగానూ సౌత్ బ్యూటీ సమంత ఒక సెన్సేషనే. కెరీర్ మొదట్లో తమిళంలో కొన్ని సినిమాలు చేసినా తెలుగులో మాత్రం ఆమె లైఫ్ టర్న్ చేసింది మాత్రం ఏమాయ చేసావే మూవీ. ఈ సినిమా సూపర్ సక్సెస్‌ తర్వాత తెలుగులో స్టార్‌ హీరోయిగ్ గా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ నటులతో నటించే అవకాశాలను కొట్టేసింది . తెలుగులో స్టార్డమ్ వచ్చాక మళ్లీ తమిళంలో క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది. విజయ్, సూర్య, విశాల్‌ వంటి తమిళ స్టార్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. అలా తెలుగు, తమిళంలో క్రేజీ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.

samantha-interesting-comments-about-pusha-item-song

కెరీర్ లైఫ్ లో సక్సెస్ అయిన సమంత వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. పెళ్లైనా కొన్నాళ్లకే సమంత నాగచైతన్య నుంచి డివోర్స్ తీసుకుంది. అభిప్రాయభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయం పక్కన పెడితే సమంత అప్పట్లో అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్పలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది. ఈ సినిమాలో ఈ పాట ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఊ అంటావా మామ అంటూ సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ మాస్ స్టెప్స్ తో అలరించింది. ఈ సాంగ్ కోసం సమంత మేకర్స్ నుంచి ఏకంగా రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. అయితే ఈ పాట చేయొద్దని ఆమె పేరెంట్స్, ఫ్రెండ్స్ చెప్పారని ఈ మధ్యనే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత. అయితే వారి మాట వినకుండా నేను ఆ పాటకు ఓకే చెప్పానని తెలిపింది. అప్పుడు ఆ పాటే నా లైఫ్ లో టర్నింగ్ గా మారిందని చెప్పింది. నిజం చెప్పాలంటే ఆ ఛాన్స్ ఎందుకు వద్దు అనేదానికి తన దగ్గర సరైన కారణం లేదంది. అలాంటప్పుడు ఎందుకు చేయకూడదని , నేనేం తప్పు చేయలేదు కదా అని నాలో నేను అనుకున్న.

samantha-interesting-comments-about-pusha-item-song

నా వివాహా జీవితంలో నేను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నా. అయితే అది వర్కౌట్‌ కాలేదు అని సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక మైయోసైటీస్‌ బారినపడిన సమంత తెలుగులో ఖుషీ సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదు. సామ్ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ చేసింది. సీటాడెల్ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతోంది. అంతే కాదు తన సొంత నిర్మాణంపైన దృష్టి పెట్టింది. సినిమాలు పెద్దగా లేకపోయినా సామ్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది.

Sri Aruna Sri

Recent Posts

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

2 days ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

2 days ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

2 days ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

2 days ago

AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…

2 days ago

Jyeshtha Pournami: నేడే జేష్ఠ్య పౌర్ణమి.. ఈ పనులు చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయినట్టే?

Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…

2 days ago

This website uses cookies.