Categories: EntertainmentLatest

Vijay Sethupathi : ఆమెతో చేయడం నా వల్ల కాదు

Vijay Sethupathi : తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి మహారాజ సినిమాతో మరోసారి వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యాడు. క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ మూవీని నిథిలన్‌ స్వామినాథన్ రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ తో పాటు అనురాగ్‌ కశ్యప్‌, భారతీరాజా, అభిరామి, మమత మోహన్ దాస్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహారాజ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రచారంలో మేకర్స్, స్టార్స్ జోరు పెంచారు. వరుగా ఇంటర్వ్యూలు ఇస్తూ విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదే క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉప్పెన మూవీలో తనతో కలిసి నటించిన హీరోయిన్ కృతి శెట్టి గురించి విజయ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

vijay-sethupathi-refused-to-act-with-south-actress-krithi-shetty

ఉప్పెన్ మూవీలో కృతి శెట్టి విజయ్ సేతుపతికి కూతురిగా నటించింది. కూతురుగా చేసిన అమ్మాయితో హీరోయిన్ గా జోడీ కట్టడం తన వల్ల కాదని విజయ్‌ సేతుపతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నేను ఈ మధ్యనే డీఎస్పీ అనే మూవీ చేశారు. ఆ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటానంటే నేను చేయలేనని డైరెక్టర్ , ప్రొడ్యూజర్లకు చెప్పా. అందుకు ఓ కారణం ఉంది. ఉప్పెన చిత్రంలో కృతి నా కూతురు క్యారెక్టర్ ప్లే చేసింది. అలా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయమంటే నా వల్ల కాదని చెప్పేశాను. అందుకే ఆ సినిమాలో కృతి వద్దు అని మేకర్స్ కు చెప్పాను. ఉప్పెన మూవీలో క్లైమాక్స్‌ స్సీన్స్ లో కృతి కొన్ని సార్లు కంగారు పడింది. అప్పుడు నేను ఆమెకు ధైర్యం చెప్పేందుకు నాకు నీ వయసున్న కొడుకున్నాడు నన్ను నీ తండ్రి అని అనుకో అని ధైర్యం చెప్పా. కూతురిగా భావించిన అమ్మాయితో హీరోయిన్ గా నటించను. అందుకే అది నా వల్ల కాదు” అని విజయ్‌ చెప్పాడు.

vijay-sethupathi-refused-to-act-with-south-actress-krithi-shetty
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.