Kalki : వరల్డ్‌వైడ్‌గా సినీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ కల్కి. సలార్ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది.
గత ఏడాది రిలీజైన ప్రభాస్ సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకు మించిన పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ తో కల్కి సినిమా రాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈమూవీలో సీనియర్ స్టార్స్ కమలహాసన్, అమితాబచ్చన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమలహాసన్ క్యారెక్టర్ 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఇక సెకెండ్ పార్ట్ లో ఆయన ఎక్కువ సీన్స్ లో కనిపిస్తారని టాక్.
సైన్స్, యాక్షన్ సీన్లతో ఈ సినిమా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నిన్న బుజ్జి అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. రీసెంట్ గా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను వదిలారు. ఆ వీడియో కి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది. బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో రేపు ఈ మూవీకి సంబంధించి ఓ ఈవెంట్ ను చేస్తున్నారు. . ఈ సినిమాకు సంబందించి మొదటిసారి ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.. దీంతో తమ అభిమాన స్టార్ ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 27 న రిలీజ్ కానుంది.