Kalki : సలార్ సాలిడ్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇక విశ్వనటుడు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకోణె, దిశాపటానీలు ప్రభాస్ కు జోడీగా కనిపించినున్నారు. అంతే కాదు టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కీ తెరకెక్కుతోంది. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమాకు సంబంధించి వస్తున్నఅప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా మేకర్స్ కల్కీ నుంచి అమితాబ్ లుక్ ను రివీల్ చేశారు. మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో అమితాబ్ అశ్వత్ధామ క్యరెక్టర్ లో కనిపించారు. మహాభారతాన్ని ఈ లింక్ చేస్తూ తీశారని ఈ గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకుల్లో కల్కీపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ రూపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ మూవీని కల్కీమేకర్స్ కాపీ కొట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ఈ రూమర్స్ ను కొట్టిపారేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 2024 జూన్ 27 న కల్కీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అమితాబ్, ప్రభాస్ సహా దీపికా పదుకోణెలు ఓ ఎడారి ప్రాంతంలో ఉండడం కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ చూసిన వారంతా ఈ మూవీ హాలీవుడ్ “డూన్”కు కాపీ అనే ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి డూన్ నవల ఎంతో స్ఫూర్తిగా నిలిస్తుందని చాలా మంది అభిప్రాయం . ఇక డూన్ నవల స్ఫూర్తితోనే నాగ్ అశ్విన్ కల్కీ తెరకెక్కిస్తున్నారని కొంత మంది నెటిజన్స్ వాదిస్తున్నారు. ఈ క్రమంలో కాపీ ఆరోపణలపై నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ రూమర్స్ ను సింపుల్ గా కొట్టిపారేసారు. “డూన్ సినిమాలో ఇసుక అలాగే కల్కి మూవీలో ఇసుక కనిపించడం వల్ల రెండు సినిమాలు ఒకే విధంగా ఎలా ఉంటాయి. ప్రేక్షకులు ఈ రూమర్స్ ను నమ్మకండి”అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.