Kalki 2898AD : సలార్ సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మూవీ కల్కీ 2898AD.మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వధ్దామ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమితాబ్ చెప్పే డైలాగ్ అదుర్స్ అనిపించింది.ఇక మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా కల్కి టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.
మహానటి సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా హిట్ తో మరో అదిరిపోయే కథతో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి కల్కి 2898AD సినిమా తీస్తున్నాడు. పాన్ వరల్డ్ ప్రెస్టీజియస్ మూవీగా నాగ్ అశ్విన్ ఈ ఫాంటసీ సినిమాను తీస్తున్నారు. సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్న ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఉన్నారు. లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, అందాల ముద్దుగుమ్మ దిశా పటాని, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కల్కీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ సందడి షురూ అయ్యింది. ఈ సినిమా జూన్ 27 న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా కల్కి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అనౌన్స్మెంట్ ఇచ్చారు. సినిమా కోసం పనిచేయాలనుకునే వారికి స్వాగతం పలుకుతున్నారు. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీంలో జాయిన్ అవ్వొచ్చు అంటూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రభాస్ సినిమా వస్తుందంటే యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారు. అందుకే ఈ పోస్ట్ షేర్ చేసిన గంటల్లోనే నెట్టింట్టో తెగ చక్కర్లు కొడుతుంది.