Kalki 2898 AD : వరల్డ్‌వైడ్‌గా సినీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మూవీ కల్కి. సలార్ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ గా రామోజీ ఫిలిం సిటీ లో ఓ మేగా ఈవెంట్ ని నిర్వహించింది కల్కి టీం. ప్రభాస్ బుజ్జి నీ ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. బుజ్జితో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ను ఫిదా చేశాడు డార్లింగ్. ఆరడుగుల కటౌట్ చూసి అరుపులు కేకలతో మొత్తం గ్రౌండ్ దద్దరిల్లింది. భైరవ లుక్ తో ఆడియన్స్ కు పిచ్చెక్కిచ్చేసాడు. అలాగే బుజ్జి గ్లింప్స్ ను కూడా విడుదల చేసి మూవీ పైన ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎప్పుడు హాయ్ బాయ్ క్షేమంగా వెళ్ళండి అని చెప్పే ప్రభాస్ నాలుగు ముక్కలు మాట్లాడడంతో అభిమానుల్లో ఆనంద వేరే లెవెల్ లో ఉంది. అంతే కాదు సూపర్ స్టార్స్ తో పనిచేయడం చాలా గర్వంగా ఉందని చెప్పాడు. ఇక ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. “సెక్యూరిటీ ని దృష్టిలో పెట్టుకుని తక్కువ మందితో ఈవెంట్ చేశాం. ఎక్కువ మంది ఫ్యాన్స్ ను పిలవనందుకు క్షమించండి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సీనియర్ స్టార్ కమల్ హాసన్లు చూసి చిత్ర పరిశ్రమ స్పూర్తి పొందింది. వారిద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్, అశ్వనీదత్లకు చాలా చాలా థ్యాంక్స్.
‘సాగర సంగమం’ సినిమాలో కమల్ సర్ వేసుకున్న బట్టలు నచ్చి, నాకూ అలాంటివి కావాలని అమ్మని అడిగేవాణ్ని. ఆయన యాక్టింగ్ కు 100 దండాలు. నా హీరోయిన్ దీపికా పదుకొణె సో బ్యూటిఫుల్ అండ్ సూపర్ స్టార్. దిశా పటానీ వెరీ హాట్ హాట్ స్టార్. నిర్మాత అశ్వనీదత్ కు ఈ ఏజ్ లోనూ సినిమపై ప్రేమ తగ్గలేదు. 50 ఏళ్లుగా ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన ఇద్దరు కూతుర్లు ఆయనలాగే ఉన్నారు”అని ప్రభాస్ తెలిపాడు.