Thu. Jan 22nd, 2026

    Kajol-Nysa Devgn : బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ స్టార్-స్టడెడ్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు తన భర్త అజయ్ దేవగన్ , కుమార్తె నైసా దేవగన్‌తో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా, తల్లీకూతుళ్లిద్దరూ అందాల ఆరబోతలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. మిరుమిట్లు గొలిపే ఐవరీ దుస్తులను ఎంచుకుని అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు. ప్రతస్తుం కాజోల్ తన కూతురు నైసాల ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి అందాల జాతరను చూసి నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు.

    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits 
    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits

    అందాల బ్లాక్ బ్యూటీ కాజోల్ అబు జానీ సందీప్ ఖోస్లా యొక్క ఫుల్వారీ కలెక్షన్ 2017 నుండి ఆర్కైవల్ కోచర్ ఫ్లేర్డ్ షేర్వానీని ఈ ఈవెంట్ కోసం ఎన్నుకుంది. కాజోల్ ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపించింది. ముత్యాలు, స్ఫటికాలు ,రేషమ్‌ల యొక్క గొప్ప సమ్మేళనంలో క్లిష్టమైన ఎంబ్రాయిడరీ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ కాజోల్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

    kajol-nysa-devgn-glamours-looks-in-ivory-abu-jani-and-sandeep-khosla-outfits
    kajol-nysa-devgn-glamours-looks-in-ivory-abu-jani-and-sandeep-khosla-outfits

    కాజోల్ ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా జ్యువెలరీని ఎన్నుకుంది. ఒక పెర్ల్ చోకర్ నెక్ లెస్ ను తన మెడలో అలంకరించుకుంది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా మ్యాచింగ్ హ్యాండ్‌బ్యాగ్‌ ను వేసుకుని తన రీగల్ లుక్‌ను యాక్సెసరైజ్ చేసింది. తల్లీ కూతుళ్లు తమ ఫోటోషూట్ మధ్యలో దిగిన క్యాడిండ్ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits 
    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits

    మరోవైపు కాజోల్ , అజయ్ దేవగన్ ల నైసా దేవగన్ ఫెదర్ డిటైలింగ్‌తో వచ్చిన డీప్ నెక్‌లైన్ గౌను ను తన ఫోటో షూట్ కోసం వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో గతంలో ఎన్నడూ కనిపించనంత అందంగా కనిపించింది నైసా. ఈ గౌనుకు మరింత అట్రాక్షన్ ను జోడించేందుకు అదే లేబుల్ నుండి షీర్ కేప్ ధరించింది. ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.

    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits 
    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits

    నైసా దేవగన్ ఈ అవుట్ ఫిట్ కు సింపుల్ మేకప్ లుక్ ను సెలెక్ట్ చేసుకుంది. ఒక మ్యాచింగ్ హెడ్ యాక్సెసరీ బ్రాస్‌లెట్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది.

    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits 
    Kajol-Nysa Devgn : glamours looks in ivory Abu Jani and Sandeep Khosla outfits

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.