Kajal Agarwal : సౌత్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కేవలం ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు ఆమె తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాని స్టైల్ ఐకాన్ కూడా. ఆమె తాజా ఫోటోషూట్ వేసవికాలపు ఫ్యాషన్‌పై ఆమెకున్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె అప్రయత్నంగా అందమైన త్రి పీస్ అవుట్ ఫిట్ తో రాక్ చేస్తుంది.

కాజల్ అందమైన ఆకుపచ్చని ఫ్లోరల్ డిజైన్ అవుట్ ఫిట్ వేసుకుని ఆదరగొట్టింది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. తన లేటెస్ట్ లుక్ తో కాజల్ తన అభిమానులను సంతోషకరమైన మిడ్-వీక్ ట్రీట్‌తో ఆశ్చర్యపరిచింది.

కాజల్ అగర్వాల్ ధరించిన త్రీ పీస్ దుస్తులలో బ్లాక్ నెట్టెడ్ ఫుల్-లెంగ్త్ ష్రగ్‌తో పాటు మ్యాచింగ్ ప్రింటెడ్ బ్రాలెట్, ప్యాంటు ఉన్నాయి.

కాజల్ బ్రాలెట్, ప్యాంట్‌లు స్టైలిష్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తో డిజైన్ చేశారు. ఇది క్లిష్టమైన ఆకుపచ్చ పూల ఎంబ్రాయిడరీతో ఎంతో అదిరిపోయింది . బ్రాలెట్ పైన నల్లని నెట్టెడ్ ష్రగ్‌ని జోడించి ఆమె దుస్తులకు పరిపూర్ణతను జోడించింది.

కాజల్ అగర్వాల్ యొక్క అందమైన దుస్తులు AK-OK దుస్తులు లేబుల్ నుండి సెలెక్ట్ చేసుకుంది. ఆమె స్టైలింగ్ నిపుణురాలు నీరజా కోన కాజల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది.

మేకప్ ఆర్టిస్ట్ విశాల్ చరణ్ , కాజల్ కు ఆకర్షణీయమైన మేకప్ అందించాడు. కనులకు వింగెడ్ ఐలైనర్, పెదాలకు న్యూడ్ నిగనిగలాడే లిప్‌స్టిక్‌ను ఎంచుకుంది.తన గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేసింది.


