Categories: EntertainmentLatest

Jyothi Rai : ఎవ్వరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్

Jyothi Rai : సినీ స్టార్స్ కన్నా బుల్లితెర నటులకు ప్రేక్షకుల్లో అమితమైన ఆధరణ ఉంటుంది. ప్రతి రోజూ వారి సీరియల్స్ చూస్తూ ఫ్యాన్స్ అయిపోతుంటారు చాలా మంది మహిళలు. అలాంటి ప్రేక్షకాధరణ పొందిన నటి జ్యోతి రాయ్. తమిళంలో పలు సీరియల్స్ నటించిన జ్యోతికి తెలుగులోనే మంచి పాపులారిటీ ఉంది. ఆమె నటించిన గుప్పెడంత మనసు సీరియల్‌తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది. జగతీ మేడం క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. సంప్రదాయంగా చీరకట్టులో కనిపించి,తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

jyothi-rai-bold-statements-about-trolling

సీరియల్ లో ట్రెడిషనల్ గా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది. తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. నెట్టింట జ్యోతి రాయ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే జ్యోతికి పెళ్లై ఓ కొడుకు ఉన్నాడు. అయినప్పటికీ యంగ్ డైరెక్టర్ సుక్కు పుర్వాజ్‌తో ఈ భామ ప్రేమాయణం కొనసాగిస్తోంది. గత కొంత కాలంగా అతనితోనే ఉంటుంది. కానీ పెళ్లిపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే కెరీర్ పరంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతి ట్రోలింగ్ పై ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

jyothi-rai-bold-statements-about-trolling

ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్‌కు బైబై చెప్పి వెండి తెరమీద మెరిసేందుకు రెడీ అయ్యింది. ఏ మాస్టర్ పీస్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ట్రోల్స్ గురించి స్పందించింది…”ఇండస్ట్రీకి వచ్చాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి న్యాయం చేయాలి. ట్రెడిషనల్‌గా కనిపించేటప్పుడు అందంగా రెడీ అవ్వాలి. అలాగే మెడ్రన్‌ లుక్ లో ఆకర్షించాలంటే మాత్రం కాస్త కష్టపడాలి. దానికి శ్రమ ఎక్కువ. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను. ట్రోలర్స్ ఏమంటున్నారనే దాని గురించి ఆలోచించను. అది నాకు అవసరం కూడా లేదు. నా సినిమాలు నావి. నా కెరీర్ నాది. నాకు నచ్చినట్లే ఉంటాను. నచ్చిన సినిమాలే చేస్తాను. వాటి కోసం ఏమైనా చేస్తాను. నన్ను ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది చేయొద్దు అని చెప్పే రైట్ ఎవ్వరికీ లేదు” అని బోల్డ్ కామెంట్స్ చేసింది.

 

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.