Jyothi Rai : సినీ స్టార్స్ కన్నా బుల్లితెర నటులకు ప్రేక్షకుల్లో అమితమైన ఆధరణ ఉంటుంది. ప్రతి రోజూ వారి సీరియల్స్ చూస్తూ ఫ్యాన్స్ అయిపోతుంటారు చాలా మంది మహిళలు. అలాంటి ప్రేక్షకాధరణ పొందిన నటి జ్యోతి రాయ్. తమిళంలో పలు సీరియల్స్ నటించిన జ్యోతికి తెలుగులోనే మంచి పాపులారిటీ ఉంది. ఆమె నటించిన గుప్పెడంత మనసు సీరియల్‌తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారింది. జగతీ మేడం క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. సంప్రదాయంగా చీరకట్టులో కనిపించి,తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
సీరియల్ లో ట్రెడిషనల్ గా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది. తన హాట్ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. నెట్టింట జ్యోతి రాయ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే జ్యోతికి పెళ్లై ఓ కొడుకు ఉన్నాడు. అయినప్పటికీ యంగ్ డైరెక్టర్ సుక్కు పుర్వాజ్‌తో ఈ భామ ప్రేమాయణం కొనసాగిస్తోంది. గత కొంత కాలంగా అతనితోనే ఉంటుంది. కానీ పెళ్లిపై ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే కెరీర్ పరంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతి ట్రోలింగ్ పై ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్‌కు బైబై చెప్పి వెండి తెరమీద మెరిసేందుకు రెడీ అయ్యింది. ఏ మాస్టర్ పీస్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ ట్రోల్స్ గురించి స్పందించింది…”ఇండస్ట్రీకి వచ్చాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి న్యాయం చేయాలి. ట్రెడిషనల్‌గా కనిపించేటప్పుడు అందంగా రెడీ అవ్వాలి. అలాగే మెడ్రన్ లుక్ లో ఆకర్షించాలంటే మాత్రం కాస్త కష్టపడాలి. దానికి శ్రమ ఎక్కువ. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నేను అస్సలు పట్టించుకోను. ట్రోలర్స్ ఏమంటున్నారనే దాని గురించి ఆలోచించను. అది నాకు అవసరం కూడా లేదు. నా సినిమాలు నావి. నా కెరీర్ నాది. నాకు నచ్చినట్లే ఉంటాను. నచ్చిన సినిమాలే చేస్తాను. వాటి కోసం ఏమైనా చేస్తాను. నన్ను ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది చేయొద్దు అని చెప్పే రైట్ ఎవ్వరికీ లేదు” అని బోల్డ్ కామెంట్స్ చేసింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.