TDP: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్ళీ గెలవాలని ప్లాన్ చేస్తూ ఉంటే ప్రతిపక్ష టీడీపీ కూడా అధికారంలోకి రావాలని కలలు కంటూ ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు సైతం మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. ఇక మిమ్మల్ని ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వం అంటూ వైసీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా అధికార పార్టీ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష వైసీపీని అణచివేసే ప్రయత్నాలు బలంగా చేస్తుంది. అయితే దీనిని టీడీపీ కూడా అంతే బలంగా ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉంటే మరో వైపు ఇప్పటికే అధికార పార్టీలో టికెట్ రాదని కన్ఫర్మ్ అయిపోతున్న నాయకులు టీడీపీ జెండా పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే టీడీపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కోటంరెడ్డి అయితే అప్పుడే ప్రపోజల్ కూడా పెట్టారు. ఇక బీజేపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అలాగే విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మరో వైపు దర్శి ఎమ్మెల్యే కూడా టీడీపీలో టికెట్ కోసం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఇక రాయలసీమలో కూడా కొంత మంది చంద్రబాబు, లోకేష్ తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇక టీడీపీ గూటికి వచ్చేవారందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి వస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ మొదటి నుంచి ఇన్ చార్జ్ లుగా పనిచేస్తూ ఎమ్మెల్యే కావాలని ఆశాపడుతున్నవారు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు వైసీపీ నేతల రాకతో ఇబ్బంది పడుతున్నారు. ఇక టీడీపీలోకి వస్తున్నవారితో ఓవర్ ఫ్లో అవుతుందనే మాట వినిపిస్తుంది. మరి దీనిని మిగిలిన పార్టీలు అనుకూలంగా మార్చుకుంటాయా? టీడీపీకి అనుకూలంగా ఉంటుందా అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.