Junk Food: ఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లలో సమూలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఇంట్లో చేసిన ఆహారానికి ఎక్కువ విలువనిచ్చి ఇష్టంగా తినేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేసి జంక్ ఫుడ్ కు బానిసలుగా మారాము. తినటానికి రుచిగా ఉంది కదా అని రోజు ఫాస్ట్ ఫుడ్ తింటే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎప్పుడో ఒకసారి సరదాగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటే ఎలాంటి నష్టం లేదు కానీ అదే పనిగా ప్రతిరోజు పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ వంటివి తింటే మాత్రం ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ మోతాదుకు మించి పెరిగి భవిష్యత్తులో గుండె, మెదడు, లివర్ అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఫాస్ట్ ఫుడ్ తయారు చేయడం కోసం ఎక్కువగా ఉపయోగించే నూనెను తరచూ కాంచడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ నశించి పోవడమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలుగా మారుతాయి.
Junk Food:
ఇక ఫాస్ట్ ఫుడ్ అన్న తర్వాత వివిధ రకాల మసాలాలు వేసి తయారు చేస్తారు ఈ మసాలా కారణంగా కూడా ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా తొందరగా జంక్ ఫుడ్ కు అలవాటు పడతారు. వాళ్లు మారం చేస్తున్నారు కదా అని మనం జంక్ ఫుడ్ తినిపించడం అలవాటు చేస్తే వీటిల్లో ఉండే ప్రమాదకర చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. పిల్లల్లో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా అనేక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వీలైనంత వరకు చిన్న పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచడం మంచిది.