NTR: తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో కూటమి భారీ విజయాన్ని సాధించింది. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు గెలవడంతో అభిమానులు సెలబ్రిటీల నుంచి ఆ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, అనేకమంది సినీ ప్రముఖులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నిన్నే చాలా మంది అభినందిస్తూ ట్వీట్స్ చేశారు.
అయితే టిడిపి అధికారంలోకి రావడంతో ముఖ్యంగా అభిమానులు అందరూ కూడా ఒకరి స్పందన కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఆ ఒక్కరు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తాజాగా ఏపీ ఫలితాలపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు.
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. కాగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి ముందు ఎన్టీఆర్ పై చాలామంది దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా కూటమి విజయం పై స్పందించడంతో ట్రోలింగ్స్ చేసిన వారు సైతం ఎన్టీఆర్ ని మెచ్చుకుంటున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.