Techniques: మీ నైపుణ్యాలు , సామర్థ్యాలను సేల్ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు మీకు ఓ అవకాశాన్ని కల్పిస్తాయి. మీరు అప్లై చేసిన ఉద్యోగానికి మీరు అర్హులేన అన్న విషయాన్ని ఈ ఇంటర్వ్యూల ద్వారా ఇంటర్వ్యూ చేసేవారు తెలుసుకుంటారు. మరి మీరు ఇంటర్వ్యూలకి వెళ్తున్నారా అయితే ఈ చిట్కాలను మీరు ఫాలో అయితే తప్పనిసరిగా మీరు జాబ్ కొట్టి తీరుతారంతే.
ఇంటర్వ్యూకు వెళ్లే మందు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ సమాధానాలు చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. దీనిని బట్టి మీ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ మీకు అద్దంలో ప్రతిబింభంగా కనిపించి మీరు మరింత స్ట్రాంగ్‌గా మారుతారు. ఇంటర్వ్యూ చేసే వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటిని ముందే ఊహించి తమ నైపుణ్యాన్ని ఉపయోగించి సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి.
ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు మన బలాలు ఏమిటో తెలుసుకోవాలి, పని చేయడానికి సుముఖంగా ఉన్నట్లు అర్ధమయ్యేలా తెలియజేయాలి. కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం ఉందని తెలపాలి. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని పరిష్కరించడంలో మిగితా వారితో కలిసి పనిచేయడంలో సృజనాత్మకత కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ మీలో ఎంత వరకు ఉన్నాయో గుర్తించి మీరు అప్లై చేసిన ఉద్యోగానికి మీకు అర్హత ఉందో గమనించి ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. రిక్వైర్మెంట్ లిస్ట్‌లో ఉన్న జాబ్ పోస్టింగ్స్‌కు సంబంధించి మీకు ఉన్న అర్హత ఏమిటో క్లియర్ కట్‌గా తెలియజేయాలి. ఇది మీ నైపుణ్యాన్ని ఇంటర్వ్యేయర్‌కి తెలియజేస్తుంది. తద్వారా మీ స్కీల్స్‌తో ఇంటర్వ్యూ చేసే వారిని ఇంప్రెస్ చేయవచ్చు.
ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూ చేస్తే సమాధానాలు చెప్పడం కాదు మీరు కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని ఉండాలి. ముందుగానే ఇంటర్వ్యూలో మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నల లిస్ట్‌ను రెడీ చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా జాబ్ , కంపెనీపైన మీకు ఉన్న ఆసక్తిని ప్రదర్శించే ప్రశ్నలను ఎన్నుకోవాలి. కంపెనీ వెబ్‌సైట్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలపైన ప్రశ్నలను అడగడం వల్ల కంపెనీపై మీకు ఉన్న అవగాహన ఇంటర్వ్యూయర్‌కు అర్థమవుతుంది. మీరు చేయాలనుకుంటున్న జాబ్ గురించిన ప్రశ్నలు కూడా అడగండి. ఆ ప్రశ్నలు ఎలా ఉండాలంటే
ఉదాహరణ:
ఈ ఉద్యోగం రోజువారీ బాధ్యతలు ఏమిటి?
నా బాధ్యతలు, పనితీరు ఎలా అంచనా వేయబడతాయి? అది ఎవరు చేస్తారు?
మీరు మీ సంస్థాగత నిర్మాణాన్ని వివరించగలరా ?
మీరు ఏ కంప్యూటర్ పరికరాలు , సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు?
వచ్చే ఐదేళ్లలో సంస్థ ప్రణాళిక ఏమిటి?
ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు ఈ వస్తువులను తీసుకువెళ్లడం మరిచిపోవద్దు. నోట్ బుక్, పెన్స్, రెజ్యూమ్, జిరాక్స్ కాపీలు, లైసెన్స్, రిఫెరెన్స్, ట్రాన్‌స్క్రిప్ట్‌లు ఇలా అన్ని లెటర్స్ వాటి జిరాక్స్‌లను, పోర్ట్ ఫోలియో వాటి వర్క్ సాంపిల్స్‌ను తప్పనిసరిగా మీతో పాటే తీసుకువెళ్లాలి. ఇంటర్వ్యూ రోజు 10 , 15 నిమిషాల ముందే ఆఫీస్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలా వెళ్లడం వల్ల మంచి ఇంప్రెషన్ పడుతుంది. కాస్త ప్రొఫెషనల్‌గా ఉండే అవుట్‌ఫిట్‌ను ధరించండి. మొబైల్స్, ఇయర్ ఫోన్స్, గాడ్జెట్స్‌ను ఇంట్లో వదలండి లేదా కార్‌లో వదిలండి లేదంటే బ్యాగ్‌లో పెట్టి ఫోన్‌ని సైలెంట్ చేసి ముఖం మీద చిరునవ్వుతో ఇంటర్వ్యూకు వెళ్లండి. మీకు మంచి మార్కులు పడతాయి.
ఇంటర్వ్యూ జరిగినంత సేపు ముఖం మీద కాన్ఫిడెన్స్ కనిపిస్తుండాలి. ఇంటర్వ్యూయర్ ప్రశ్న అడగ్గాన్నే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇవ్వండి. స్టార్టింగ్ పరిచయంలోనే స్ట్రాంగ్ షేక్ హ్యాండ్ ఇవ్వండి అది మీకు చెయ్యి అందిస్తే మాత్రమే. లేదంటే గుడ్ మార్నింగ్ అని చెప్పి స్మైల్ ఇస్తే సరిపోతుంది. వారు అడిగే ప్రశ్నను శ్రద్ధగా వినండి దానిని బట్టి మీ స్కిల్స్‌ను ఉపయోగించి నిజాయితీగా, సూటిగా సమాధానం చెప్పండి. మీకు ప్రశ్న సరిగా అర్థం కాకపోతే మరోసారి చెప్పమని అడగండి.
మీ మీద ఇంటర్వ్యూయర్‌కు మంచి అభిప్రాయం కలిగేలా ఇంటర్వ్యూను ముగించండి. ఇంటర్వ్యూ జరిగినంత సేపు మర్యాదపూర్వకంగా మెలగాలి. సానుకూలంగా ఇంటర్వ్యూను పూర్తి చేయాలి. ఇంటర్వ్యూ ఎండింగ్‌లో ఇంతకు ముందు చెప్పకుండా మిగిలిన విషయాలను మీ స్కిల్స్‌ను మరోసారి తెలియజేయండి. ఎప్పుడు మిమ్మల్ని సంప్రదిస్తారో తెలుసుకోండి. ఇంటర్వ్యూ పూర్తైన తరువాత థాంక్యూ నోట్ చెప్పడం మరిచిపోవద్దు.