Janhvi Kapoor : ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా ఇన్ ఫ్యాషన్ ఎగ్జిబిట్‌లో జాన్వీ కపూర్ అబ్బురపరిచే గోల్డెన్ గౌనులో స్టార్‌లా మెరిసింది. NMACC గాలా యొక్క 2వ రోజు అగ్రశ్రేణి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇది గ్రాండ్ ఓపెనింగ్ వేడుక మాదిరిగానే విలాసవంతంగా కొనసాగింది. కపూర్ యొక్క అద్భుతమైన ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలను పోస్ట్ చేయడంతో తన ఫాలోవర్స్ ఖుషి అయ్యారు. గోల్డెన్ సీక్విన్ గౌనులో తన ఆకర్షణీయమైన అవతార్‌ను ప్రదర్శించింది.

జాన్వీ కపూర్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు పర్ఫెక్ట్ మ్యూజ్‌గా పనిచేసింది. ఆమె ఒంపులను ఖచ్చితంగా ప్రదర్శించే క్లిష్టమైన గోల్డెన్ సీక్విన్ వర్క్‌తో అలంకరించబడిన అద్భుతమైన బ్లాక్ గౌను ధరించింది.

స్వీట్ హార్ట్ నెక్‌లైన్, స్లీవ్‌లెస్ గౌన్‌లో దూకుతున్న ఆమె అందాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కార్సెట్డ్ బాడీస్, సిన్చ్డ్ నడుము, మెర్మైడ్ స్టైల్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ డ్రెస్ ఆమె ఫిగర్‌ని హైలెట్ చేస్తోంది.జాన్వీ తన రూపానికి అదనపు డ్రామాని జోడించేందుకు రాగి వలలు కలిగిన పొడవాటి దుపట్టాతో యాక్సెసరైజ్ చేసింది.

జాన్వీ తన రూపానికి స్టేట్‌మెంట్ బహుళ లేయర్డ్ డైమండ్ నెక్లెస్, బరువైన రాళ్లు పొదిగిన గాజులు, నుదుటన బొట్టు పెట్టుకుని గ్లామర్ స్ గా కనిపించింది.

మేకప్ ఆర్టిస్ట్, రిద్ధిమా శర్మ సహాయంతో, జాన్వీ బ్రౌన్-టోన్డ్ మేకప్ లుక్‌ను ఎంచుకుంది. స్మోకీ కోహ్ల్-లైన్డ్ కళ్ళు, భారీ మస్కరామరియు, ముదురు గోధుమ రంగులో మెరిసే ఐషాడోఉన్నాయి, న్యూడ్ బ్రౌన్ లిప్ షేడ్‌తో ఆమె లుక్ ముగిసింది. చివరగా, హెయిర్‌స్టైలిస్ట్, ఆంచల్ మోర్వానీ సహాయంతో, జాన్వీ తన పొడవాటి కురులను అందంగా మార్చుకుంది.
