Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ అటు తండ్రి బోనీకపూర్, ఇటు కరణ్ జోహార్ సపోర్ట్ తో బాగానే బండి లాగిస్తోంది. హిందీలో అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ స్టార్‌గా మారింది. ఎప్పటి నుంచో బోనీ తన కూతుళ్ళను సౌత్ సినిమా ఇండస్ట్రీలకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. ఎట్టకేలకి జాన్వీ ఎన్.టి.ఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా వదిలారు. మంచి ట్రెడిషన్ వేర్‌లో ఉన్న జాన్వి లుక్ మన తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ ఇంకోవైపు యాడ్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే, ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌తో నెటిజన్స్‌కి చమటలు పట్టిస్తోంది. ఇప్పుడు కూడా జాన్వీ కపూర్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్నాయి. తల్లి శ్రీదేవి అంత అందంగా లేకపోయినా ఈ తరం కుర్రాళ్ళకి మాత్రం సరిపోయే హాట్ హాట్ అందాలతో నిద్ర లేకుండా చేస్తోంది.
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఉగాది పండుగ సందర్భంగా అని నెటిజన్స్, ఆమె అభిమానులు అనుకుంటున్నారు. జస్ట్ క్యాజువల్ పిక్స్ అనిపిస్తున్నా కూడా జాన్వీ ఎద అందాలను చూస్తుంటే ఎవరికైనా కళ్ళు తిప్పాలనిపించదు. అంతగా కొంటె చూపులు చూస్తూ జాన్వీ కవ్విస్తోంది. ఇప్పుడు అందరూ జాన్వీ షేర్ చేసిన ఈ పిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కాబట్టి ఇక ఇక్కడ స్టార్స్‌గా కొనసాగుతున్న యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమంటున్నారు. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా మన ఆడియన్స్‌కి నచ్చినా ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అప్పుడు ఫొటో షూట్స్ కోసం ఎదురుచూడరు. ఏకంగా అమ్మడిని తెలుగు సినిమాలలో సిల్వర్ స్క్రీన్‌పై చూసి చొంగ కార్చుకుంటారు.