Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటి జాన్వీ కపూర్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ భామ సొంతం. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు వివిధ రకాల మోడ్రన్ స్టైల్‌లను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. అది బికినీ అయినా లేదా సొగసైన ఆరు గజాల చీర అయినా, ఆమె ఏ సందర్భానికైనా ఎలాంటి దుస్తులనైనా అద్భుతంగా చూపించగలదు.
ఇటీవల, జాన్వీ తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ట్రీట్ చేసింది, తన అద్భుతమైన గౌనుతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఆమె ఫ్యాషనబుల్ అవతార్‌ని చూసి ఆమె అభిమానులు విస్మయం చెందారు.
జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సిల్వర్ కలర్ దుస్తులను ధరించి తన చిత్రాలను పంచుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ ప్రియాంక కపాడియా ఆమెను గ్లామరస్ అవుట్ లో స్టైల్ చేసింది, ప్రియాంక బోర్కర్ హెయిర్‌స్టైలింగ్ చేసింది రివేరా లిన్ గ్లామ్ లుక్ అందించింది. ఈ అవుట్ ఫిట్ ను దుస్తులు లేబుల్ మాగ్డా బుట్రిమ్ అల్మారాలు నుండి సేకరించింది. జాన్వీ గ్లామ్‌పై దృష్టి సారించి మినిమమ్ స్టైలింగ్‌తో మెస్మరైజ్ చేసింది .
జాన్వీ బవాల్ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ బిగ్ డేకి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నందున, మేకర్స్ మన అభిమాన బాలీవుడ్ తారల కోసం ముంబైలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఈ ఈవెంట్ కు తమన్నా భాటియా నుండి పూజా హెగ్డే వరకు, సెలబ్రిటీలు తమ బిజీ షెడ్యూల్‌ల కొంత సమయం వెచ్చించారు .
ఈ ఈవెంట్ లో రెడ్ కార్పెట్‌పై అందమైన డ్రెస్‌లో కనిపించి జాన్వీ దృష్టిని దోచుకుంది. అందమైన బాడీకాన్ ఫిట్, స్లీవ్‌లెస్ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో వచ్చిన అవుట్ ఫిట్ లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఆకర్షణీయమైన మెరుపుతో ఉన్న అవుట్ ఫిట్ కు సూట్ అయ్యేలా ఉంగరాల కురులను లూస్ గా వదిలేసింది.
మోనోకినీలో ఓపెన్ బ్యాక్, లో-కట్ ఆర్మ్‌హోల్స్ స్కూప్ నెక్‌లైన్, వెండి చంకీలు , లేయర్డ్ బ్రాస్‌లెట్‌లు అనేక అందమైన బంగారు నెక్లెస్‌లతో కూడిన ఆభరణాలతో ఆకర్షించే లుక్స్ తో తనను తాను స్టైల్ చేసింది .ఆమె అవుట్ ఫిట్ అందరిని అట్రాక్ట్ చేసింది.
వర్క్ ఫ్రంట్‌లో, జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటుడు వరుణ్ ధావన్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ తో కలిసి బవాల్ సినిమా చేసింది. ఆమె రాజ్‌కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కూడా నటించనుంది. ఈ హాట్ బ్యూటీ ఎన్టీఆర్ 30 సినిమా దేవర లోనూ మెరవనుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ తో జాన్వీ రొమాన్స్ చేయనుంది.