Janasena Party: ఎన్నికలకి మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చి ఎలక్షన్స్ లో కచ్చితంగా బలమైన స్థానాలలో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢసంకల్పంతో ఉన్నారు. అలాగే వైసీపీని గద్దె దించడానికి బలమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చే న్యూస్ బయటకొచ్చింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ గా ఉన్న గాజుగ్లాసుని ఇప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా మార్చేసింది. జనసేన అబ్యర్ధనని తోసిపుచ్చి మరీ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గాజు గ్లాసు గుర్తుపైన జనసేన 2019 ఎన్నికలలో పోటీ చేసింది. తరువాత తక్కువ స్థానాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసింది. అయితే కామన్ సింబల్ కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు జనసేన పార్టీ లేదని ఈసీ డిసైడ్ అయ్యి గాజుగ్లాసు గుర్తుని కామన్ సింబల్ గా తొలగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇది ఆ పార్టీకి షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. పొత్తులలో భాగంగా వెళ్తున్న జనసేన పార్టీకి కామన్ సింబల్ అది కూడా గాజు గ్లాసు ఉంటే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.
పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు బలమైన స్థానాలలో గెలిచే అవకాశం ఉండేది. అయితే ఒక్కో అభ్యర్ధికి ఒక్కో గుర్తు కేటాయించడం వలన ఇప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. జనసేనకి ఓటు వేయాలని అనుకున్న ఏ గుర్తు అభ్యర్ధి జనసేన అనేది తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది ఫలితాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ గాజు గ్లాసు సింబల్ సాధించుకుంటారా అనేది చూడాలి.