Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన స్థానాలలో గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికోసం వారాహితో బస్సుయాత్ర మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఈ సారి కచ్చితంగా జనసేనాని ప్రభావం బలంగా ఉంటుందని, తక్కువలో తక్కువ 20 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అలాగే తమ ఓటు షేర్ 24 శాతం ప్రస్తుతం ఏపీలో ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు. దీనిని బట్టి కచ్చితంగా ప్రభావవంతమైన స్థానాలలో గెలవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళడానికి రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అన్ని స్థానాలలో పోటీ చేయకపోయిన కచ్చితంగా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో చెప్పారు. ఇక 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే కనీసం 35 నుంచి 40 అసెంబ్లీ సీట్లలో కూడా జనసేన తెలంగాణలో పోటీ చేయడానికి రెడీ అవుతుంది. అయితే తెలంగాణలో ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని అనుకుంటున్నా బీజేపీ అవకాశాలకి జనసేన రూపంలో గండి పడే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
బీజేపీ ఒంటరిగా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని ఇప్పటికైతే చెబుతుంది. అయితే జనసేన పార్టీ కూడా పోటీ చేస్తే, మరో వైపు వైఎస్ షర్మిల కూడా అన్ని నియోజక వర్గాలలో పోటీ చేసే ఛాన్స్ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక టీడీపీ కూడా తెలంగాణలో పోటీ చేయడానికి క్యాడర్ ని సిద్ధం చేస్తుంది. ఇలాంటి సమయంలో వ్యతిరేక ఓటు చీలిన కూడా ఇలా బీజేపీకి అవన్నీ పడతాయని గ్యారెంటీ లేదు. కచ్చితంగా కాంగ్రెస్, జనసేన, టీడీపీ. వైఎస్ఆర్టీపీ పార్టీలు ఓటుని చీల్చుతాయి. అలా జరిగితే మళ్ళీ కేసీఆర్ కి అందరూ కలిసి అధికారం అప్పగించినట్లు అవుతుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి హైదరాబాద్ కార్పోరేషన్ ఎలక్షన్స్ లో ఎలా అయితే తప్పించారో అలా తప్పించాలని బండి సంజయ్ టీమ్ భావిస్తుంది. అలా జరగాలంటే ఏపీలో జనసేనతో బీజేపీ కలిసి రావాల్సిన అవసరం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే ఎన్నికల ముందు సమీకరణాలు కచ్చితంగా మారుతాయనే మాట వినిపిస్తుంది.