Tue. Jan 20th, 2026

    Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా తన విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటంలో రహదారి విస్తరణ కారణంగా ఇళ్ళు ద్వంసం అయిన బాధితులకి లక్ష రూపాయిల పరిహారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం ప్రజలు చూపించినంత తెగువ అమరావతి రైతులలో ఉండి ఉంటే వైసీపీ రాజధానిని కదిలించే ధైర్యం చేసేది కాదని అన్నారు. విద్వంసమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, ప్రజల ఇళ్ళు కూలగొట్టి వారి ఉసురు పోసుకున్న ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని అన్నారు. తమని ముఖ్యమంత్రి జగన్ రౌడీ సేన అంటున్నారని, అయితే తమది విప్లవ సేన అని, రౌడీలసేన కాదని కౌంటర్ ఇచ్చారు. రౌడీలు ఉన్న పార్టీ వైసీపీ అనిఅన్నారు .

    వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీగా ఆ పార్టకి ఉగ్రవాద సలహాలు ఇచ్చే వ్యక్తిగా సజ్జల ఉన్నారని విమర్శించారు. ప్రకృతి వనరుని దోచుకోవడం విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని అన్నారు. ప్రకృతి వనరులని నాశనం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది గరుడపురాణం చదివితే తెలుస్తుందని అన్నారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఏంటో చూపిస్తా అని, అలాగే అభివృద్ధి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తానని అన్నారు. అయితే ప్రజలు తనని గెలిపించిన, గెలిపించకున్నా తన ప్రాణం ఉన్నంత వరకు వారికి తాను అండగా నిలబడతానని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు.

    Janasena challenges YCP regarding 2024 electionsఅలాగే 2024లో వైసీపీని కచ్చితంగా గద్దె దించుతా అని ఇప్పుడే దీనిపై ఛాలెంజ్ చేసి చెబుతున్నా అని పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీకి సవాల్ విసిరారు. దీనిపై ఎప్పటిలాగే మంత్రి రోజా, పేర్ని నాని, జోగి రమేష్ లాంటి నేతలు అందరూ మీడియా ముందుకి వచ్చి ఎప్పటిలానే పాత పాటే పాడటం విశేషం. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని, అతన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నాడని విమర్శలు చేశారు. అలాగే కులాలు గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.