Sreeleela : కుర్ర భామ శ్రీలీలకి ఓ ఆరోగ్య సమస్య ఉందని తాజాగా తనే స్వయంగా రివీల్ చేసింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ సమంత, రాశిఖన్నా, అనుష్క శెట్టి సహా పలువురు బాలీవుడ్ భామల వరకూ చాలామందికి అనారోగ్య సమస్యలున్నాయని వారే స్వయంగా చెప్పారు. ముఖ్యంగా సమంత మయోసైటిస్ వల్ల చాలా బాధపడింది. మొత్తానికి కోలుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం బాగా వర్కౌట్స్ చేస్తూ ఐయాం బ్యాక్ అంటోంది.
అయితే, ఇలా శ్రీలీలకి ఓ హెల్త్ ప్రాబ్లెం ఉందట. చాలామందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది. కాస్త చల్లగాలి తగిలితే జలుబు చేసి ముక్కు కారుతూ ఉంటుంది. ఇది దుమ్ము ధూళితోనూ వస్తుంది. డస్స్ట్ అలర్జీ ఉందని చాలామంది కథానాయికలు బాధపడుతూ ఉంటారు. అలా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలకి ముక్కు సమస్య ఉందట. ఇటీవల ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.
రోజూ ఉదయం లేవగానే కనీసం 30 సార్లు తుమ్ములు వస్తాయట. ఎలా ఆ తుమ్ములు వస్తాయో కూడా తుమ్మి చూపించింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈ సమస్యను తగించుకోవడానికి చాలామంది డాక్టర్లను సంప్రదించిందట. కానీ, ఇంతవరకూ ఈ తుమ్ముల సమస్య నుంచి బయటపడలేదని చెప్పుకొచ్చింది. చలికాలం గానీ, చల్లటి ప్రాంతంలో గానీ ఉంటే ఉదయం వచ్చే తుమ్ములను అదుపుచేయలననీ శ్రీలీల తెలిపింది.
కాగా, ఇటీవల ధమాకా సినిమాతో అమ్మడు సాలీడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా, సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా చేస్తున్న సినిమా, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్మ్ తేజ్ నటిస్తూన్న సినిమాలలో కనిపించబోతోంది. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే.