Categories: LatestMost ReadNews

War: యుద్ధం చేయాల్సింది ఆధిపత్యం కోసమా… నమ్ముకున్న వాళ్ళకోసమా?

War: యుద్ధం… ఈ పదం చిన్నదే కాని దాని ద్వారా జరిగే విధ్వంసం మాత్రం మాటలలో వర్ణించలేని స్థాయిలో ఉంటుంది. ఆ యుద్ధం కారణంగా జరిగే ప్రాణ నష్టం లక్షల నుంచి కొట్లలో కూడా ఉంటుంది. ఆ యుద్ధం మిగిల్చిన కన్నీళ్లు కొన్ని దశాబ్దాల పాటు ప్రజలని విషాదంలోని నడిపిస్తాయి. ఆ యుద్ధం రాసిన జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. అలాగే యుద్ధంతో జరిగే ఆర్ధిక నష్టం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో అగ్ర రాజ్యం అయిన రష్యా అతి చిన్న దేశం అయిన ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతుంది.

ఇప్పటికే వేలాది సంఖ్యలో సైనికుల ప్రాణాలు పోయాయి. ఇటు ఉక్రెయిన్ లో కూడా ప్రజలు, సైనికులు వేలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ మారణహోమం లో లక్షలాది మంది ప్రజలు గాయాలతో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. అయితే ఈ యుద్ధంలో అతి చిన్న దేశం అయిన ఉక్రెయిన్ ని ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఉన్న రష్యా ఇప్పటి వరకు హస్తగతం చేసుకోలేక పోవడానికి కారణాలు చూసుకుంటే. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైనికులు, ప్రజలు పోరాటం చేస్తుంది. వారి హక్కులని కాపాడుకోవడం కోసం, వారి స్వేచ్చని రక్షించుకోవడం, తమని నమ్ముకున్న వాళ్ళని బానిసలుగా మార్చాలని చూస్తున్న రష్యా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ పౌరులు కూడా సైనికులుగా మారి యుద్ధక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.

వారి పోరాటం అంతా వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి కారణం ఆధిపత్యం కోసం. ఉక్రెయిన్ కి అమెరికా అందిస్తున్న సహకారాన్ని భరించలేక. ఎలా అయిన రష్యాలో ఉక్రెయిన్ ని భాగం చేసుకోవాలని నియంతృత్వ ధోరణితో ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటం. ఈ పోరాటంలో రష్యా గెలిచిన ప్రపంచ దృష్టిలో ఎప్పటికి ఒక విలన్ గా ఉంటుంది. రష్యాని మిత్ర దేశంగా చూసే ఇండియా, ఇక్కడి ప్రజలు కూడా రష్యా ప్రభుత్వాన్ని విలన్ గానే చూస్తారు. అయితే ఉక్రెయిన్ ఈ యుద్ధంలో గెలవచ్చు, ఓడిపోవచ్చు కాని ఆ దేశ అధ్యక్షుడు జెలన్ స్కీ పోరాటాన్ని హీరోయిజం గా ప్రపంచం మొత్తం చూస్తుంది. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణాలకి తెగించి తమపై యుద్ధాన్ని ప్రకటించిన రష్యాతో విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ సైన్యం, జెలన్ స్కీ నాయకత్వాన్ని ప్రపంచం మెచ్చుకుంటుంది.

తమ కోసం నాయకుడు నిలబడ్డాడు అనే ధైర్యం ప్రజలలో ఉంటే వారి ప్రాణాలు ఇచ్చి అయిన శత్రువుపై పోరాటానికి ముందుకొస్తారు. ఇప్పుడు ఆ తెగింపు, ధైర్యం జెలన్ స్కీని చూసిన తర్వాత ఆ దేశ ప్రజలకి వచ్చింది. అందుకే తమ స్వేచ్చని రక్షించుకోవడం కోసం తామే సమిధలుగా మారుతున్నారు. రష్యాని బలంగా ఎదుర్కొంటున్నారు. కళ్ళముందు తమ వాళ్ళు చనిపోతున్న తెగించి ముందుకి దూకుతున్నారు. ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరిగిన ఏ యుద్ధంలో కూడా రాజు నాయకుడుగా గుర్తింపు పొందలేదు. ప్రతినాయకుడు అనే అనిపించుకున్నాడు. కురుక్షేత్రంలో కౌరవులు అయిన, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అయిన ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ని అయిన ఈ ప్రపంచం ప్రతినాయకులుగానే చూస్తుంది తప్ప ఎప్పటికి హీరోయిజం ఆపాదించదు. మన జీవితంలో కూడా ఎదుటివారితో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చిందంటే అది మనల్ని నమ్ముకున్నవాళ్ళకోసం అయ్యుండాలి తప్ప ఆధిపత్యం కోసం మాత్రం కాకూడదు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.