Lord Ganesha: మన హిందూ సంప్రదాయాల ప్రకారం దేవుళ్లను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. ఇక దేవుళ్ళలో ఆది దేవుడిగా వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాము. ఇలా తొలి పూజ వినాయకుడికి చేయటం వల్ల మనం చేసే ఏ కార్యం ఎంతో నిర్విఘ్నంగా సాగుతుందని ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవని భావిస్తుంటారు. అందుకే వినాయకుడికి తొలి పూజ చేస్తూ ఉంటాము అయితే చాలామంది ఇంటి ప్రధాన ద్వారం తలుపు పై భాగంలో కూడా వినాయకుడు ప్రతిమ ఉండేది వేసుకునే ఉంటారు ఇలా తలుపు పై వినాయకుడు ప్రతిమ ఉండటం మంచిదేనా ఉంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే..
సాధారణంగా మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి చాలామంది పూజ చేస్తూ ఉంటారు. అయితే తలుపు పై భాగంలో కూడా వినాయకుడి ప్రతిమ ఉండటం వల్ల ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా వినాయకుడు అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి దుష్టశక్తులు చెడు ప్రభావం రాకుండా ఉండటం కోసం వినాయకుడిని ఇంటి ప్రధాన గుమ్మం ముందు ప్రతిష్టిస్తూ ఉంటారు
ఈ క్రమంలోనే ఇంట్లోకి చెడు దృష్టి రాకుండా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలి అంటే ఇంటి ప్రధాన తలుపు పై భాగంలో వినాయకుడు ఉండటం మంచిది. మెయిన్ డోర్ పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివిటీ రాదు. ఇంట్లో అంతా సానుకూలమే. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఇల్లు కలిగిస్తుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం వద్ద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరిస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవు.