Puri Jagannadh : పూరి జగన్నాథ్ ఫ్లాప్ సినిమాలకి కారణమే ఆయనేనా..?

Puri Jagannadh : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోకి మాస్ ఇమేజ్ కావాలంటే పూరి జగన్నాథ్ రాసుకున్న కథలో ఇమిడితే చాలు. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఆ హీరోకి మంచి మాస్ ఫ్యాన్స్‌ని ఇస్తారు. అంతకముందు ఎన్ని హిట్స్ కొట్టినా పూరి డైరెక్షన్‌లో సినిమా చేస్తే వచ్చే ఇమేజ్ దానికి నాలుగురెట్లుంటుంది. టాలీవుడ్‌లో మాత్రమే కాదు ఏ భాషలో అయినా పూరి సినిమా తీసి సక్సెస్ అందుకోగలరు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ లాంటి సీనియర్ హీరోకి కలర్ ఫుల్ కాస్టూంస్ వేపించి డాన్సులు చేయించగలరు.

Is he the reason behind Puri Jagannath’s movies?

పూరి రాసే డైలాగ్స్‌తో హీరోకి ఓ ఇమేజ్ దక్కిందంటే ఆ డైలాగ్స్ ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో అర్థమవుతుంది. కథ, కథనం రొటీన్ అయినప్పటికీ మేకింగ్ విషయంలో ఆయన స్టైల్ ఇంకో లెవల్ అని చెప్పాలి. కథలన్నీ ఒక్కటే. ఎవరి స్టైల్ మేకింగ్ వాడిది..దాంతోనే హిట్ కొట్టేది..అంటూ ఓ కొత్త ఫిలాసఫీని చెప్పింది పూరినే. ఇక ఆయన సినిమాలో కనిపించే హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్‌ను గ్లామర్‌గా చూపించడంలో..పూరికి ఓ స్టైల్ ఉంటుంది.

Puri Jagannadh : ఎవరూ పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నారు.

ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను వదిలింది ఇప్పటివరకూ కనిపించలేదు. బద్రి, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, ఇడియట్, పోకిరి, టెంపర్ ఇలా టైటిల్‌తోనే అందరిలో ఓ ఆసక్తిని రేకెత్తించగల దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమా ఇండస్ట్రీలో ఓ దర్శకుడు సంపాదించలేనంత డబ్బును, పేరును ఆయన సంపాదించారు. అలాగే, ఎవరూ పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నారు. అయినా ఎప్పుడూ డీలా పడలేదు. దానికి కారణం ఆయన మీద ఆయనకున్న నమ్మకమే.

15రోజుల్లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 90 రోజుల్లో సినిమా రిలీజ్ చేయగల సత్తా ఉన్న దర్శకుడు ఇప్పటివరకూ ఒక్క పూరీనే అని అందరికీ తెలిసిందే. కానీ, అలా తీయడంతో పూరి సినిమాకి క్రేజ్ తగ్గిపోయింది. పాత చింతకాయపచ్చడి అనే మాట గతకొంతకాలంగా పూరి తీస్తున్న సినిమాలను చూసి అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనాల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. సూపర్ హిట్ అని మౌత్ టాక్ వచ్చినా థియేటర్ వరకూ వచ్చి సినిమా చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. దానికి తోడు పూరి సినిమాలు మరీ మొహం మొత్తేసినట్టు అనిపిస్తున్నాయి. ఆయన కథ ఎందుకు రాశారో…? అని కూడా సినిమా చూసి బయటకి వచ్చిన ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. అందుకే, ఇప్పుడు పూరి పక్కాగా కథ రెడీ అయ్యాకే సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

5 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.