Categories: HealthLatestNews

Health: చద్దన్నం పొద్దున్నే తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Health: ప్రస్తుతం మన జీవనశైలిలో ఉదయాన్నే టిఫిన్ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. రకరకాల టిఫిన్స్ తినడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పదేళ్ళ వెనక్కి వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్ని చద్దన్నం ఉల్లిపాయ తిని రైతులు వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు. ఇక ఆ చద్దికూడుతోనే మధ్యాహ్నం వరకు కష్టపడేవారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేవారు. రాత్రి మిగిలిపోయిన అన్నంలో గంజి వేసి వదిలేస్తే అది ఉదయానికి భాగా పులుస్తుంది. అలా పులిచిన అన్నాన్ని చద్ది అన్నం అంటారు. ఈ చద్ది అన్నం ప్రజల జీవన శైలిలో భాగంగా ఉండేది. ఇప్పటి గ్రామీణ ప్రాంతాలలో పెద్దవాళ్ళు టిఫిన్స్ కంటే చద్దన్నం తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా చద్దన్నం తినడం వలన వారు ఇప్పటికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతున్నారు.

అయితే ఇప్పుడు టిఫిన్స్ చేస్తున్నవారిలో ఇమ్యూనిటీ పవర్ క్రమంగా తగ్గిపోయి 40 ఏళ్ళ నుంచి రకరకాల రోగాల బారిన పడుతున్నారు. చద్దన్నం అంటే చాలా చిన్న చూపుగా చూసేవారు ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే మరల దాని ప్రాధాన్యతని ప్రజలు గుర్తించ కలుగుతున్నారు. తాజాగా అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంపై చాలా వాస్తవాలు బయటపెట్టింది.  పులిసిన అన్నంలో ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి పోషకాల అధిక మోతాదులో ఉంటాయని తెలిపారు.  అప్పుడే వండుకునే అన్నంలో కంటే దానిని గంజిలో వేసి పులిసిన తర్వాత ఐరన్ బీ6, బీ12 విటమిన్ లు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు.

ఇక చద్దన్నం తినడం వలన వ్యాధినిరోధక శక్తి శరీరం లో పెరుగుతుందని తెలిపారు. అలాగే శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుందని పేర్కొన్నారు. అలాగే ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఒంటికి నీరసం ఆవహించదని , శరీరంలో  వ్యర్ధాలని చద్దన్నం బయటకి పంపిస్తుంది అని తెలిపారు. అలాగే ఎదిగే వయస్సులో పిల్లలని కూడా చద్దన్నం పోషకాహారంగా అందిస్తే మంచింది చెబుతున్నారు. అలాగే బరువు తగ్గించడంలో కూడా చద్దన్నం ఎంతో అద్భుతంగా పని చేస్తుందని తెలిపారు.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.